AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనే కాదు.. మరో ఆరుగురు అమ్మాయిలతో కూడా.. ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వీణ..

రోజుకో వీడియో, పూటకో ట్విస్ట్‌ అన్నట్టుగా కంటిన్యూగా హెడ్‌లైన్స్‌లోకి వస్తోంది జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ వివాదం. ఇవాళ కూడా బాధితురాలు వీణ మరో రెండు బాంబులు పేల్చింది. అరవ శ్రీధర్‌కు తనతోనే కాదు, మరో ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించింది. అంతేకాదు 5 అబార్షన్లపై వస్తున్న విమర్శలపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బాధితురాలు..

నేనే కాదు.. మరో ఆరుగురు అమ్మాయిలతో కూడా.. ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వీణ..
Mla Arava Sridhar
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2026 | 6:56 PM

Share

రోజుకో వీడియో, పూటకో ట్విస్ట్‌ అన్నట్టుగా కంటిన్యూగా హెడ్‌లైన్స్‌లోకి వస్తోంది జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ వివాదం. ఇవాళ కూడా బాధితురాలు వీణ మరో రెండు బాంబులు పేల్చింది. అరవ శ్రీధర్‌కు తనతోనే కాదు, మరో ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందని ఆరోపించింది. అంతేకాదు 5 అబార్షన్లపై వస్తున్న విమర్శలపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బాధితురాలు.. 18నెలల్లో 5అబార్షన్లు. అసలిది సాధ్యమేనా అంటూ బాధితురాలు వీణపై విమర్శల వాన కురిసింది. అయితే తనకు జరిగింది అబార్షన్ కాదని, అబార్టెడ్ అంటున్నారు వీణ. అంటే గర్బం వచ్చిందని తెలియగానే టాబ్లెట్స్ తీసుకుని గర్భం రాకుండా చేసుకున్నానన్నది బాధితురాలి వెర్షన్. అంతేకాదు అసలు 25కోట్లు తాను అడగలేదని, అసలా వాయిస్సే తనది కాదంటూ వీణ పేర్కొన్నారు.

అరవ శ్రీధర్‌కు ఆరుగురు అమ్మాయిలతో సంబంధం ఉందంటున్నారు వీణ. ఆ విషయం తెలిసినప్పటి నుంచే తాను వీడియోలను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశానంటూ వీణ పేర్కొన్నారు. అలాగే దీన్ని ఒక మహిళ, పురుషుడికి సంబంధించిన అంశంగానే చూడాలని, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు వీణ. NHRCఆదేశాలతో అరవశ్రీధర్‌పై కేసు నమోదైందని, ఏపీ వ్యక్తులతో సంబంధంలేకుండా, నేషనల్ వుమెన్ కమిషన్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వీణ తెలిపారు.

ఇప్పటికే MLA అరవ శ్రీధర్‌పై మరో వీడియో వదిలింది బాధితురాలు హర్షవీణ.. తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించిన చాటింగ్‌ను బయటపెట్టిందామె. తాతంశెట్టి నాగేంద్రను అరవ శ్రీధర్‌ తిట్టినట్టుగా చాటింగ్‌లో కామెంట్స్‌ ఉన్నాయి. తాతంశెట్టి నాగేంద్రకు కొవ్వు ఉందని.. అందుకే, దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడని శ్రీధర్‌ అన్నట్టుగా ఆ చాటింగ్‌లో వ్యాఖ్యలు ఉన్నాయి . ఇలా రోజుకో ట్విస్ట్‌తో అరవశ్రీధర్ వివాదం పరుగులు పెడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌కే ఫిక్స్ అయిన సూర్య – దుల్కర్‌.. ఎందుకలా
టాలీవుడ్‌కే ఫిక్స్ అయిన సూర్య – దుల్కర్‌.. ఎందుకలా
పోయిందనుకున్న బంగారం వెతుక్కుంటూ వచ్చింది.. దుబాయ్‌లో భారతీయ మహిళ
పోయిందనుకున్న బంగారం వెతుక్కుంటూ వచ్చింది.. దుబాయ్‌లో భారతీయ మహిళ
తెలంగాణలో వీరికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. దరఖాస్తు ఇలా..
తెలంగాణలో వీరికి ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. దరఖాస్తు ఇలా..
రజనీ - కమల్‌ మూవీ.. స్టోరీ లీక్‌ !! కథ మామూలుగా లేదుగా
రజనీ - కమల్‌ మూవీ.. స్టోరీ లీక్‌ !! కథ మామూలుగా లేదుగా
మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఆ రాశులవారు కాస్త జాగ్రత్త..! అధికారం, ఆదాయం తగ్గే ఛాన్స్
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
ఓటర్ ఐడీ లేకున్నా.. ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.. ఎలా అంటే?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
పాకిస్తాన్ పాలిట ముగ్గురు విలన్లు.. 2 ఏళ్ల ఓటమి రుచి మరోసారి..?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా
హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా