AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: మార్చి నెలాఖరు వరకు ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు..!

ఆదాయాన్ని పెరగడానికి అవకాశాలు కల్పించడంలో బుధుడు సిద్ధహస్తుడు. ఆకస్మిక శుభ పరిణామాలను కలిగించడంలో కేతువు ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న బుధుడితో సింహ రాశిలో ఉన్న కేతువుకు పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి మార్చి నెలాఖరు వరకు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఈ రాశులవారు ఆదాయ వృద్ధి కోసమే ఎక్కువగా పాటుపడడం జరుగుతుంది. బుధు కేతువుల పరస్పర దృష్టి వల్ల మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 5:25 PM

Share
మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో కేతువుతో యుతి చెందడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం జరుగుతుంది. ఆదాయాన్ని ఆశించిన స్థాయిలో పెంచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తులు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు, రావలసిన సొమ్ము చేతికి అందడం, బాకీలు, బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలోనే ఉన్న కేతువును బుధుడు వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. కుటుంబపరంగా కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.

2 / 6
సింహం: ఈ రాశిలో ఉన్న కేతువును బుధుడు వీక్షించడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా పురోగమిస్తుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి.

3 / 6
తుల: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కేతువును బుధుడు వీక్షించడం వల్ల కొంత ప్రయత్నపూర్వకం గానూ, కొంత అప్రయత్నంగానూ ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము తప్పకుండా చేతికి అందుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు అంచనాలను మించి లాభిస్తాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. లాటరీ గెలిచే సూచనలున్నాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతువుతో బుధుడికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఆదాయం పెరగడానికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగుల జీత భత్యాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల బాగా లాభిస్తాయి.

5 / 6
కుంభం: ఈ రాశిలో ఉన్న బుధుడితో సప్తమ స్థానంలో ఉన్న కేతువుకు సమసప్తక దృష్టి ఏర్పడినందువల్ల ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు ఊహించని లాభాలనిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.

6 / 6