AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ తిరుగులేని హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఆమె.. హీరోయిన్ గా గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

మూడు నెలలు నరకం.. ఆరుసార్లు రక్తం మార్పిడి.. భయంగా బ్రతికామన్న స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2026 | 4:48 PM

Share

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది. హీరోలకు సమానంగా సినిమాలే కాదు రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం మన ఇండస్ట్రీలోనే కాదు ఆమె గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఆ ముద్దుగుమ్మ.. అలాగే ఇప్పటికీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వయసులో తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది ఈ చిన్నది. ఈ అమ్మడి పెళ్లి సమయంలో చాలా విమర్శలు వచ్చాయి. అవేమి పట్టించుకోకుండా ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె కూతురి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

పైన మనం మాట్లాడుకున్న హీరోయిన్ ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో చాలా పాపులర్ హీరోయిన్. అక్కడ స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమె హాలీవుడ్ లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా చేస్తుంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన కూతురి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కూతురు పుట్టిన సమయంలో మూడు నెలలు నరకం చూశా అని తెలిపింది ప్రియాంక.

ప్రియాంక నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రియాంక కంటే అతను 10ఏళ్లు చిన్నవాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ చిన్నారి సరోగసి ద్వారా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి పేరు మాల్తీ మేరీ. అయితే ఆ పాప నెలలు నిండకుండానే పుట్టిందట.. మూడు నెలలు ముందుగానే పాప జన్మించిందని.. తమ కుమార్తె పుట్టిన సమయంలో 765 గ్రాముల బరువు మాత్రమే ఉందని తెలిపింది ప్రియాంక. అప్పుడు కొన్ని నెలలపాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందని. పైగా అప్పుడు కరోనా సమయం కావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని తెలిపింది ప్రియాంక. చావు బతుకల మధ్య తన కుమార్తె హాస్పిటల్ లో పోరాటం చేసిందని.. ఆ సమయంలో చాలా భయంగా బ్రతికామని చెప్పుకొచ్చింది ప్రియాంక. మూడు నెలల్లో తన కూతురికి ఆరు సార్లు రక్తం మార్చారని తెలిపింది ప్రియాంక. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని తన కూతురు క్షేమంగా బయటపడిందని ప్రియాంక దంపతులు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
EPF వర్సెస్‌ VPF.. రెండింటికీ తేడా ఏంటి?
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
కిలో వెండి ధర రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? భారీగా తగ్గనున్న బంగారం
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు... నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!
మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా? నిమిషాల్లో కనిపెట్టేయండిలా!
షూటింగ్ స్పాట్‌లో తారక్ చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ ఫిదా
షూటింగ్ స్పాట్‌లో తారక్ చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ ఫిదా
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం