మాజీ మంత్రి మల్లా రెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందన్న ప్రచారాన్ని ప్రీతి రెడ్డి ఖండించారు. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతామని స్పష్టం చేస్తూ, మల్లారెడ్డి AI డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం కోసం ప్రధాని మోదీని ఆహ్వానించిన నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నామని తెలిపారు. బీజేపీలో చేరడం కేవలం వదంతి మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.