AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mancherial: రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన

మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ కలకలం రేపుతోంది. స్నేహితులతో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లి అదృశ్యమైన ఆటో డ్రైవర్ ఆచూకీ ఎంతకీ లభించడం లేదు. వారం రోజులుగా అణువణువు గాలించినా ఎలాంటి ఫలితం లభించలేదు. ఒక్కడి కోసం 30 మంది గజ ఈతగాళ్లు , మూడు కెమారాల్లో , పదుల సంఖ్యలో పోలీసులు , వందల మంది స్థానికులు గోదావరి అంతా గాలింపు చేపట్టినా లాభం లేకుండా పోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో సంచలనంగా మారింది. వారం రోజులు గడిచినా ఒక్క క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.

Mancherial: రాత్రి పూట పేకాట ఆడేందుకు వెళ్లి మిస్సింగ్.. మిస్టరీగా మారిన ఘటన
Guda Mallesh
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 24, 2026 | 1:45 PM

Share

మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం నాగ సముద్రం గ్రామానికి చెందిన గూడ మల్లేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 15 న ఏడుగురు పేకాట రాయుళ్లతో కలిసి జన్నారం మండలం తిమ్మాపూర్ గోదావరి నది ఒడ్డున గందం నారాయణ అనే నిర్వహికుడు నిర్వహిస్తున్న పేకాట స్థావరానికి‌ పేకాట ఆడేందుకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో లాంతర్ వెలుగులను చూసి పోలీసులు దాడులకు దిగారని భావించి పేకాట స్థావరం నుండి అంతా పరారయ్యారు. వచ్చిన‌వాళ్లు చేపలు పట్టే జాలరులను తెలుసుకుని మిగిలిన వారంతా తిరిగి పేకాట స్థావరానికి‌ రాగా ఒక్క మల్లేష్ మాత్రం తిరిగి‌రాలేదు.

తెల్లవారు దాక మద్యం సేవిస్తూ పేకాట ఆడిన మిగిలిన టీం సభ్యులు‌ మల్లేష్ మిస్సింగ్ విషయాన్ని దాచిపెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. అర్థరాత్రి అయినా మల్లేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు‌ గురయ్యారు. ఫోన్ కూడా స్విచ్ ఆప్ అవడంతో అనుమానం వచ్చిన మల్లేష్ భార్య సుజాత ఈనెల 17 తన భర్త కనిపించడం లేదని దండెపల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మల్లేష్ కోసం గాలింపు చేపట్టారు. మల్లేష్ తో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లిన పేకాట రాయుళ్లను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తిమ్మపూర్ శివారులోని గోదావరి ఒడ్డున పేకాట ఆడినట్టు గుర్తించి.. సమీప ప్రాంతంలో మల్లేష్ ఆచూకీ కోసం గాలించారు. ఓ చోట మల్లేష్ చెప్పులను గుర్తించిన పోలీసులు.. రాత్రి చీకట్లో అదుపు తప్పి గోదావరిలో పడిపోయి ఉంటాడని భావించి.. గోదావరి మడుగులో వెతికించారు అయినా ఆచూకీ లభించలేదు.

సీన్ కట్ చేస్తే వారం రోజులైనా మల్లేష్ జాడ కానరాలేదు. గోదావరి సమీపంలో అనువనుణు గాలింపు చేపట్టినా మల్లేష్ ఆచూకీ దొరకలేదు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. అసలు‌ మల్లేష్ ఏం అయిపోయినట్టు.. అసలు‌ఆ రాత్రి‌ ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు పేకాట రాయుళ్లను విచారించినా ఎలాంటి సమాచారం రాబట్ట లేకపోయారు పోలీసులు. ఈనెల 14 న అర్థరాత్రి రాత్రి తిమ్మాపూర్ గ్రామ శివారు గోదావరి ఒడ్డున పేకాట ఆడేందుకు వెళ్లాడు మల్లేష్. అర్థరాత్రి సమయంలో పేకాట స్థావరం వైపు టార్చ్ లైట్ వెలుగులు పడటం చూసి పోలీసులు ఏమో అనుకుని పేకాట స్థావరం నుండి అంతా పరారయ్యారు. అంతే మల్లేష్ మళ్లీ పేకాట స్థావరానికి తిరిగి రాలేదు. పేకాట స్థావరానికి కొద్ది దూరంలో అతని చెప్పులు విడిచినవి విడిచినట్లుగానే ఉన్నాయి. ఫోన్ కూడా స్విచ్ ఆప్ అవడంతో.. అనేక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. పోలీసులకు దొరికితే పరువు పోతుంది.. కేసు నమోదు అవుతుందనుకుని భయంతో ఎక్కడి కైనా పారిపోయాడా లేదా జరగరాని ఘోరం ఏదైనా జరిగిందా అన్నది తేలడం లేదు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి , జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ విచారణను వేగవంతం చేశారు. పది‌మంది‌ గజ ఈతగాళ్లు , 30 మంది సిబ్బంది , మూడు డ్రోన్ లతో గోదావరి అనువనువు గాలిస్తున్నారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ నేతృత్వంలో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. 14 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన జరిగి వారం దాటినా చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో అసలేం జరిగి‌ ఉంటుందన్న ఆందోళన అటు పోలీసుల్లో ఇటు కుటుంబ సభ్యుల్లో స్థానిక గ్రామస్తుల్లో మొదలైంది.

మల్లేష్ కు భార్య సుజాత ఇద్దరు‌ కూతుర్లున్నారు. పెద్ద కూతురు గూడ ఆశా సైనీ బాసరలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు సుస్మిత ములుగు జిల్లా కేంద్రంలో సీఓఈ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. పిల్లలిద్దరికి తండ్రి మిస్ అయిన విషయం తెలిస్తే ఆందోళనకు‌ గురవుతారంటూ బోరున విలపిస్తోంది మల్లేష్ భార్య. ఇంతకీ మల్లేష్ ఏమైనట్టు.. అతన్ని ఎవరై‌నా ఏమైనా చేశారా..? పోలీసుల భయంతో పారిపోయి ప్రమాదానికి గురయ్యాడా.. లేక ఎక్కడికైనా పారిపోయాడా అన్నది అంతుచిక్కడం లేదు.

Follow Us