బాలయ్య అభిమానులకు షాక్.. బొద్దుగా మోక్ష‌జ్ఞ.. సినిమాలకు దూరమేనా..?

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త హీరో వస్తాడా అని ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు షాక్ తగిలినట్లైంది. నిన్న మొన్నటి వరకూ మోక్ష‌జ్ఞ‌ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశచెందుతున్నారు. మోక్ష‌జ్ఞను చూస్తుంటే సినిమాల్లోకి వచ్చేలా కనిపించడంలేదని అంటున్నారు. న‌ట‌న‌పై ఈయ‌న‌కు ఆస‌క్తి లేద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించ‌డంతో షాక్ అయ్యారు అభిమానులు. అయితే ఏదోలా మ‌న‌సు మార్చుకుంటాడులే అనుకుంటే ఇప్పుడు ఈయ‌న ఫిజిక్ అంద‌రికీ షాక్ ఇస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోల్లో […]

బాలయ్య అభిమానులకు షాక్.. బొద్దుగా మోక్ష‌జ్ఞ.. సినిమాలకు దూరమేనా..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 29, 2019 | 12:14 PM

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త హీరో వస్తాడా అని ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు షాక్ తగిలినట్లైంది. నిన్న మొన్నటి వరకూ మోక్ష‌జ్ఞ‌ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు నిరాశచెందుతున్నారు. మోక్ష‌జ్ఞను చూస్తుంటే సినిమాల్లోకి వచ్చేలా కనిపించడంలేదని అంటున్నారు. న‌ట‌న‌పై ఈయ‌న‌కు ఆస‌క్తి లేద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించ‌డంతో షాక్ అయ్యారు అభిమానులు. అయితే ఏదోలా మ‌న‌సు మార్చుకుంటాడులే అనుకుంటే ఇప్పుడు ఈయ‌న ఫిజిక్ అంద‌రికీ షాక్ ఇస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోల్లో మోక్షు చాలా బొద్దుగా ఉన్నాడు. ఫిజిక్‌పై కూడా దృష్టి పెట్ట‌డం లేదు. పైగా బాల‌య్య డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది అదిరిపోయే డాన్సులు. నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరోలు వచ్చి ఇప్పటికే 13 సంవత్సరాలు అవుతోంది. ఇన్ని సంవత్సరాలుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలయ్యలే ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్ హీరోల వారసులు ఒకరి తర్వాత మరొకరు కొత్తకొత్త సినిమాలతో ఎంట్రీలు ఇస్తున్నారు. మెగా ఫ్యామిలీ అయితే తమ కుర్రాళ్లతో ఇండస్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నందమూరి కుటుంబం మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu