బిగ్‌బాస్‌ 3: ఎలిమినేట్ అయిన హేమ.. ఎంట్రీ ఇచ్చిన తమన్నా

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ సీజన్‌-3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో తొలి ఎలిమినేషన్‌ జరిగింది. తొలి వారం వచ్చిన ఓట్ల ఆధారంగా నటి హేమ షో నుంచి ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో హేమ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడారు. మరోవైపు ఈ వారం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా జరిగింది. వైల్డ్‌కార్డ్‌ ద్వారా ఎవర్ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపిస్తారా? అనే ఉత్కంఠకు నాగ్‌ తెరదించారు. ట్రాన్స్‌జెండర్‌ తమన్నాసింహాద్రికి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ప్రవేశం కల్పించారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:02 am, Mon, 29 July 19
బిగ్‌బాస్‌ 3: ఎలిమినేట్ అయిన హేమ.. ఎంట్రీ ఇచ్చిన తమన్నా

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ సీజన్‌-3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో తొలి ఎలిమినేషన్‌ జరిగింది. తొలి వారం వచ్చిన ఓట్ల ఆధారంగా నటి హేమ షో నుంచి ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో హేమ బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడారు. మరోవైపు ఈ వారం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ కూడా జరిగింది. వైల్డ్‌కార్డ్‌ ద్వారా ఎవర్ని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపిస్తారా? అనే ఉత్కంఠకు నాగ్‌ తెరదించారు. ట్రాన్స్‌జెండర్‌ తమన్నాసింహాద్రికి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ప్రవేశం కల్పించారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తమన్నా బరిలో నిలిచారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి నెలకొంది.