అందరికీ అదో పెద్ద జోక్.. ‘బిగ్‌బాస్‌’పై చిన్మయి ఫైర్

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ తేడా లేకుండా ప్రతి భాషలోనూ ఈ షోను ఆపివేయాలంటూ కొందరు తమ గొంతును వినిపిస్తూనే ఉన్నారు. కాగా తమిళ్‌లో ఇటీవల టెలికాస్ట్‌ అయిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌పై ఫైర్ అయ్యారు ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ‘‘మహిళలను తడిమేందుకే మేము బస్సులను ఎక్కేవాళ్లమని ఓ సెలబ్రిటీ చెప్పిన వ్యాఖ్యలను తమిళ ఛానెల్ గర్వంగా ప్రసారం చేసింది. ఆ వ్యాఖ్యలకు అక్కడున్న అందరూ ఎంజాయ్ […]

అందరికీ అదో పెద్ద జోక్.. ‘బిగ్‌బాస్‌’పై చిన్మయి ఫైర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 12:41 PM

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ తేడా లేకుండా ప్రతి భాషలోనూ ఈ షోను ఆపివేయాలంటూ కొందరు తమ గొంతును వినిపిస్తూనే ఉన్నారు. కాగా తమిళ్‌లో ఇటీవల టెలికాస్ట్‌ అయిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌పై ఫైర్ అయ్యారు ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.

‘‘మహిళలను తడిమేందుకే మేము బస్సులను ఎక్కేవాళ్లమని ఓ సెలబ్రిటీ చెప్పిన వ్యాఖ్యలను తమిళ ఛానెల్ గర్వంగా ప్రసారం చేసింది. ఆ వ్యాఖ్యలకు అక్కడున్న అందరూ ఎంజాయ్ చేయడం గమనర్హం. ప్రేక్షకులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారందరికీ ఇదో పెద్ద జోక్’’ అని చిన్మయి కామెంట్ పెట్టారు.

కాగా ఇటీవల జరిగిన బిగ్‌బాస్ తమిళ్ ఎపిసోడ్‌లో నటి మీరా మిథున్ మాట్లాడుతూ.. టాస్క్‌ పేరుతో తనపై చేయి చేసుకున్నాడని దర్శకుడు చేరన్‌పై బిగ్‌బాస్ వ్యాఖ్యత కమల్‌ హాసన్‌కు ఫిర్యాదు చేసింది. దానికి స్పందించిన కమల్.. ‘‘ఎవరూ కావాలనే అమ్మాయిలను ఇబ్బందిపెట్టరు.. ఉదాహరణకు రస్సుగా ఉన్న బస్సులో వెళ్లే వారు మహిళలను ఇబ్బంది పెట్టడానికి వెళ్లరు.. కొందరు తమ పని మీద కూడా వెళ్తుంటారు’’ అన చెప్పుకొచ్చాడు. దీనికి వెంటనే అక్కడున్న మరో కంటెస్టెంట్ శరవణన్ మాట్లాడుతూ.. ‘‘కాలేజీ సమయంలో అమ్మాయిలు ఉంటారన్న ఉద్దేశ్యంతోనే తాను రస్సుగా ఉన్న బస్సుల్లో వెళ్లేవాడిని’’ అని చెప్పాడు. ఇక ఈ మాటలకు అక్కడున్న వారందరూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశారు. ఆ తరువాత కమల్ హాసన్ నవ్వుతూ.. ‘‘ఇతడు అన్ని చేశాడు. ఇప్పుడు పవిత్రుడయ్యాడు’’ అంటూ శరవణన్‌ను ఉద్దేశించి తన ‘గుణ’ చిత్రంలోని డైలాగ్‌ను చెప్పి ముగించాడు.

ఈ వీడియోను చిన్మయి షేర్ చేస్తూ.. ‘బిగ్‌బాస్‌’ ఎపిసోడ్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా ఆ వీడియోపై పలువురు నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో