అడుగడుగునా విజయ్ దేవరకొండ కష్టం చూపించిన లైగర్ – Liger Movie Review
Liger Movie Review: సినిమాను ఓటీటీకి ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరిగినప్పుడు, నా సినిమాకి మీరు చెప్తున్న ఆ అమౌంట్ చాలా తక్కువ. థియేటర్లలో అంతకు మించి సౌండ్ చేస్తుంది అని కాన్ఫిడెన్స్ చూపించిన నటుడు విజయ్ దేవరకొండ.
Liger Movie Review: సినిమాను ఓటీటీకి ఇస్తున్నారనే ప్రచారం జోరుగా జరిగినప్పుడు, నా సినిమాకి మీరు చెప్తున్న ఆ అమౌంట్ చాలా తక్కువ. థియేటర్లలో అంతకు మించి సౌండ్ చేస్తుంది అని కాన్ఫిడెన్స్ చూపించిన నటుడు విజయ్ దేవరకొండ. నా జీవితంలో ఎంత కష్టపడాలో, అన్నీ విధాలా శ్రమించి చేసిన సినిమా లైగర్. మీకు నచ్చుతుందనడానికి నాది గ్యారంటీ అని గట్టిగానే చెప్పేశారు విజయ్. మరి గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ ఎలా ఉంది?
సినిమా: లైగర్
నిర్మాణ సంస్థలు: ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్
పంపిణీ: ఏ ఏ ఫిల్మ్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోణిత్ రోయ్, విషు రెడ్డి, గెటప్ శీను, అలీ తదితరులు
రచన – మాటలు: పూరి జగన్నాథ్
కెమెరా: విష్ణు శర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సునీల్ కశ్యప్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల: ఆగస్ట్ 25, 2022
ఎంఎంఏ ఫైటర్ బలరామ్‌కీ, బాలామణికి పుట్టిన బిడ్డ లైగర్ (విజయ్ దేవరకొండ). ఎంఎంఏ ఫైటర్‌గా ఇంటర్నేషనల్‌కి ఆడాలన్నది అతని కల. మైక్ టైసన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఎదుగుతాడు. ఎలాగైనా అతన్ని చాంపియన్‌ని చేయాలని అతని తల్లి కలగంటుంది. చేతిలో డబ్బులు లేకపోయినా కొడుకును వెంటపెట్టుకుని ముంబైలో చాయ్ బండి పెట్టుకుంటుంది. ఎంఎంఏ గైడ్ దగ్గర చేరుస్తుంది. ముంబైలో డబ్బున్న వాళ్లమ్మాయి తాన్య (అనన్య పాండే). ఆమె సోదరుడు సంజు (విషు) కూడా ఎంఎంఏ ఫైటర్. తాన్య మోడలింగ్‌లో ఉంటుంది. హాలీవుడ్‌లో యాక్టింగ్ కెరీర్‌లో రాణించాలనుకుంటుంది. లైగర్ ఫైటింగ్ స్టైల్ చూసి అతనితో ప్రేమలో పడుతుంది. లైఫ్‌లోకి అమ్మాయి వస్తే కెరీర్ పాడైపోతుందనే నమ్మకంతో ఉంటుంది లైగర్ తల్లి. అందుకే తాన్యకి ఫోన్ చేసి తిడుతుంది. లైగర్‌కి ఉన్న నత్తిని కారణంగా చూపించి తాన్య విడిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? లైగర్ అనుకున్న స్థాయికి చేరుకున్నాడా? ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ వేదిక మీద ఏం జరిగింది. అసలు తాన్య ఎవరు? లైగర్ కెరీర్‌కి ఆమె చేసిన సపోర్ట్ ఏంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు సినిమాలో చూసిన విజయ్ దేవరకొండకీ, లైగర్ విజయ్‌కీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. కండలు తిరిగిన దేహం, ఆ హెయిర్ స్టైల్స్… నత్తితో అతను చెప్పే డైలాగులు, అక్కడక్కడా యాటిట్యూడ్ అన్నీ మెప్పిస్తాయి. పాటల ట్యూన్లు, పిక్చరైజేషన్ కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే ఉంది. పర్ఫెక్ట్ కేరక్టర్ పడాలేగానీ, రమ్యకృష్ణ నెక్స్ట్ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తారనడానికి మరో ఎగ్జాంపుల్ ఈ సినిమా. తన పంచప్రాణాలు కొడుకుగా భావించే బాలామణి అనే తల్లి కేరక్టర్‌కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారామె. గెటప్ శీను, అలీ కేరక్టర్లు బావున్నాయి. అనన్య పాండే స్క్రీన్ మీద కనిపించినంత సేపూ గ్లామరస్‌గా కనిపిస్తారు. సెట్లు, లొకేషన్లు రిచ్‌గా అనిపిస్తాయి. నత్తి కారణంగా విజయ్ చెప్పే డైలాగుల్లో అక్కడక్కడా ఫన్ కూడా క్రియేటైంది.
హీరో, హీరోయిన్ల ప్రేమ కథ గొప్ప ఇంట్రస్టింగ్‌గా అనిపించదు. ఎంఎంఏ ఫైటర్‌గా నేషనల్ లెవల్లోనూ, ఇంటర్నేషనల్ వేదిక మీద లైగర్ పోరాడటానికి పడ్డ శ్రమను ఇంకాస్త ఎలివేట్ చేయాల్సింది. చివరన మైక్ టైసన్‌తో రింగులో ఫైట్ ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ వేదిక మీద జరగాల్సిన ఫైట్ అలా బయట జరగడం, తేలిగ్గా క్లైమాక్స్ కంప్లీట్ కావడం పూరి ఫ్యాన్స్ కి కాస్త మింగుడుపడని విషయం.
టెక్నికల్‌గా కెమెరా డిపార్ట్ మెంట్ కృషి ఎలివేట్ అయింది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం ఎఫెక్టివ్‌గా లేదు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్లందరూ మనకు పెద్దగా పరిచయం లేని ఆర్టిస్టులు కావడం వల్ల కూడా తెలుగు సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్ కలగకపోవడానికి కారణం.
బాటమ్ లైన్: విజయ్ కృషి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.
– డా|| చల్లా భాగ్యలక్ష్మి
మరిన్ని సినిమా వార్తలు చదవండి