Vijay Deverakonda: అభిమానులతో కలిసి సినిమా చూసిన లైగర్ టీం.. విజయ్ క్రేజ్ చూసి అనన్య షాక్..

ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు విజయ్ ఫిదా కాగా... రౌడీ హీరోకు ఉన్న క్రేజ్ చూసి అనన్య ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Vijay Deverakonda: అభిమానులతో కలిసి సినిమా చూసిన లైగర్ టీం.. విజయ్ క్రేజ్ చూసి అనన్య షాక్..
Vijay Deverakonda
Follow us

|

Updated on: Aug 25, 2022 | 3:08 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ (Liger) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు (Vijay Deverakonda). ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే, విజయ్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా నత్తి ఉన్న బాక్సర్ పాత్రలో రౌడీ జీవించేశాడని.. మొత్తంగా లైగర్ చిత్రం వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా తన కోస్టార్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి గురువారం ఉదయం హైదరాబాద్‏లోని సుదర్శన్ థియేటర్లో సందడి చేశారు విజయ్. రౌడీని చూసిన వెంటనే అక్కడున్న అభిమానులు లైగర్, లైగర్ అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు విజయ్ ఫిదా కాగా… రౌడీ హీరోకు ఉన్న క్రేజ్ చూసి అనన్య ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అనంతరం అభిమానులతో కలిసి లైగర్ సినిమా వీక్షించారు విజయ్, అనన్య. మరోవైపు దేశవ్యాప్తంగా లైగర్ సినిమా థియేటర్లలో ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. భారీ కటౌట్స్, పాలాభిషేకాలు అంటూ రచ్చ చేస్తున్నారు. లైగర్ సినిమా కోసం బాక్సార్ గా కనిపించేందుకు దాదాపు రెండేళ్లు విజయ్ శిక్షణ తీసుకుని తన బాడీని పూర్తిగా మార్చుకున్నాడు. అంతేకాకుండా నత్తితో మాట్లాడేందుకు చాలా కష్టపడినట్లు లైగర్ ప్రమోషనల్లో చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించాడు. తల్లి ఆశయం కోసం పోరాడే కొడుకు పాత్రలో కనిపించి మెప్పించాడు విజయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు