Liger Release Highlights: థియేటర్లలో లైగర్ రచ్చ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Rajitha Chanti

|

Updated on: Aug 25, 2022 | 1:19 PM

Liger Theater talk Live Updates: ఇందులో విజయ్ మాస్ లుక్‏లో అదరగొట్టారని టాక్ వినిపిస్తుంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ, అనన్య పాండే తన పాత్ర పరిధికి నటించి మెప్పించారని టాక్.

Liger Release Highlights: థియేటర్లలో లైగర్ రచ్చ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Liger

Liger Theater talk Live Updates: డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం లైగర్. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 25న) పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ మాస్ లుక్‏లో అదరగొట్టారని టాక్ వినిపిస్తుంది. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ, అనన్య పాండే తన పాత్ర పరిధికి నటించి మెప్పించారని టాక్.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Aug 2022 01:16 PM (IST)

    బాలీవుడ్ కా బాప్ విజయ్..

    లైగర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. ఈరోజు విడుదలైన లైగర్ చిత్రానికి నార్త్ ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ అదరగొట్టాడు అంటూ.. పూరి స్క్రీన్ ప్లే సూపర్ అంటున్నారు హిందీ ప్రేక్షకులు.

  • 25 Aug 2022 01:03 PM (IST)

    లైగర్ టీంకి హీరోయిన్ కేతిక శుభాకాంక్షలు..

    హీరోయిన్ కేతిక శర్మ లైగర్ చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపింది.

  • 25 Aug 2022 12:33 PM (IST)

    మాస్ సెలబ్రెషన్స్..

    గురువారం విడుదలైన లైగర్ చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ లైగర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబంరాలు జరుపుకుంటున్నారు.

  • 25 Aug 2022 12:09 PM (IST)

    థియేటర్లలో ఫ్యాన్స్ సంబరాలు..

    లైగర్ సినిమా విడుదల నేపథ్యంలో చిత్తూరులోని ఓ థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. లైగర్ బ్లాక్ బస్టర్ హిట్.. విజయ్ వన్ మ్యాన్ షో అంటూ రచ్చ చేస్తున్నారు.

    ట్వీట్..

  • 25 Aug 2022 11:46 AM (IST)

    బ్లాక్ బస్టర్ హిట్ లైగర్..

    ట్విట్టర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. విజయ్ వన్ మ్యాన్ షో.. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. ట్రైన్ ఫైట్.. ట్రైనర్స్ తో ఫైట్ సూపర్ అని.. ఇంటర్వెల్ లో విజయ్ తన నటనతో కుమ్మేసాడంటున్నారు ప్రేక్షకులు.

    ట్వీట్..

  • 25 Aug 2022 11:30 AM (IST)

    అభిమానులతో కలిసిన లైగర్..

    ఈరోజు విడదలైన లైగర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో కలిసి థియేటర్లో సినిమా వీక్షించారు విజయ్ , అనన్య.

  • 25 Aug 2022 11:10 AM (IST)

    థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి..

    తెలుగు రాష్ట్రాల్లో లైగర్ థియేటర్ల వద్ద అభిమానుల సందడి మాములుగా లేదుగా..విజయ్ పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

  • 25 Aug 2022 11:05 AM (IST)

    లైగర్ వన్ మ్యాన్ షో..

    యాక్టింగ్‏లో విజయ్ తగ్గేదే లే.. మొత్తం వన్ మ్యాన్ షో.. బ్లాక్ బస్టర్ హిట్ లైగర్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నారు.

    ట్వీట్..

  • 25 Aug 2022 10:31 AM (IST)

    లైగర్ మాస్ ఎంటర్టైనర్..

    లైగర్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్. విజయ్ దేవరకొండ లుక్స్ సూపర్. యాక్షన్ సీన్స్, సాంగ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అద్భుతం. మాస్ ఆడియన్స్ మెచ్చే సినిమా.

    ట్వీట్..

  • 25 Aug 2022 10:12 AM (IST)

    ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్స్‏లెంట్..

    ఒక రెజ్లర్ ప్రయాణం, పోరాట సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలలో లైగర్ ఒకటి. విజయ్ మరోసారి తన పాత్రలో జీవించాడు. మైక్ టైసన్ అద్భుతమైన పాత్రలో కనిపించాడు. అనన్య మరింత అందంగా ఉంది అంటూ రివ్యూ ఇస్తున్నారు నెటిజన్స్.

    ట్వీట్..

  • 25 Aug 2022 09:43 AM (IST)

    అంచనాలను పెంచేసిన పూరి..

    లైగర్ సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంచనాలను మరింత పెంచేశాడు. దేవరకొండ ఇంట్రడ్యూస్ సీన్ ఫైర్ అని టైటిల్ ఇంట్రో బాగుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    ట్వీట్..

  • 25 Aug 2022 09:40 AM (IST)

    లైగర్ టీంతో కేజీఎఫ్ డైరెక్టర్..

    గురువారం లైగర్ సినిమా గ్రాండ్‏గా విడుదలైంది. అయితే రిలీజ్‏కు ఒక్కరోజు ముందు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మేమంతా నవ్వుతున్నాం. కానీ లోపల ప్యాక్ అవుతుందంటూ తమ టీంలో కలిసున్న ఫోటో షేర్ చేశారు. అందులో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉండడం విశేషం.

    ట్వీట్..

  • 25 Aug 2022 09:34 AM (IST)

    మెప్పించిన దేవరకొండ..

    లైగర్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. ఈ చిత్రంలో వచ్చే ఎమోషనల్ సీన్స్.. ముఖ్యంగా విజయ్ యాక్టివ్ వేరేలెవల్.

  • 25 Aug 2022 09:23 AM (IST)

    లైగర్ కోసం దుల్కర్ సల్మాన్..

    భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రయూనిట్‏కు మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ విషెష్ తెలిపారు. మీ కష్టానికి ఫలితం గొప్ప ప్రేమను పొందుతారంటూ చెప్పుకొచ్చారు.

  • 25 Aug 2022 09:16 AM (IST)

    థియేటర్లలో లైగర్ సందడి..

    ఈ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన అనన్య.. ఫస్ట్ మూవీతోనే ప్రశంసలు అందుకుంటుంది. అలాగే విజయ్ బెస్ట్ ఫర్ఫామెన్స్ ఇచ్చారని.. పూరి స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తల్లికొడుకుల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Published On - Aug 25,2022 9:12 AM

Follow us