AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లిపాయలు కొనేటప్పుడు ఈ ట్రిక్స్ తెలియకపోతే జేబుకు చిల్లే.. ఈ సీక్రెట్స్ పక్కా తెలుసుకోండి..

మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఆదరాబాదరాగా చేతికి అందిన ఉల్లిపాయలను సంచిలో వేసేస్తున్నారా? అయితే మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నట్లే. ఉల్లిపాయ పైకి బాగానే కనిపిస్తున్నా.. లోపల కుళ్లిపోయిందా, బూజు పట్టిందా అని తెలుసుకోవడానికి కొన్ని చిన్న ట్రిక్స్ ఉన్నాయి. తాజా ఉల్లిపాయలను ఎలా గుర్తించాలో తెలుసుకుంటే నెలల తరబడి అవి పాడవకుండా ఉంటాయి.

Krishna S
|

Updated on: Oct 26, 2026 | 9:09 PM

Share
ఉల్లిపాయలు ఎంచుకునేటప్పుడు ప్రధానంగా గమనించాల్సింది వాటి పైపొర. ఉల్లిపాయ తొక్క కాగితంలా పూర్తిగా ఎండిపోయి, పొరలు పొరలుగా సులభంగా ఊడివచ్చేలా ఉండాలి. కొద్దిగా తడిగా ఉన్నా లేదా పచ్చి తేమ కనిపిస్తున్నా వాటిని అస్సలు కొనకూడదు. తేమ ఉన్న ఉల్లిపాయలు చాలా త్వరగా బూజు పట్టి లోపలి నుంచి కుళ్లిపోతాయి. అలాగే ఉల్లిపాయను చేతితో పట్టుకున్నప్పుడు దృఢంగా, గట్టిగా ఉండాలి. వేలితో నొక్కినప్పుడు మెత్తగా లోపలికి దిగబడుతున్నట్లు అనిపిస్తే అవి లోపల పాడైపోయాయని అర్థం.

1 / 5
చాలామంది మార్కెట్లలో మొలకలు వచ్చిన ఉల్లిపాయలను తక్కువ ధరకే వస్తున్నాయని కొంటుంటారు. కానీ పైభాగం నుండి ఆకుపచ్చని మొలకలు వచ్చిన ఉల్లిపాయలను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. మొలకలు వచ్చినప్పుడు ఉల్లిపాయలోని సహజ తేమ, పోషకాలన్నీ తగ్గిపోయి రుచి పూర్తిగా మారిపోతుంది. అంతేకాకుండా ఉల్లిపాయపై నల్లటి మసి లాంటి పొడి లేదా బూజు కనిపించినా, కొద్దిపాటి దుర్వాసన వస్తున్నా వాటిని పక్కన పెట్టేయాలి. ఆ నల్లటి బూజు ఇతర మంచి ఉల్లిపాయలకు సైతం క్షణాల్లో వ్యాపించి మొత్తం నిల్వను పాడుచేస్తుంది.

2 / 5
మంచి ఉల్లిపాయలను ఎంపిక చేసుకోవడమే కాకుండా వాటిని ఇంటికి తెచ్చిన తర్వాత భద్రపరిచే విధానం కూడా ఎంతో ముఖ్యం. చాలామంది మార్కెట్ నుంచి తీసుకువచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే ఉల్లిపాయలను అలాగే ఉంచేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో గాలి ఆడకపోవడం వల్ల తేమ పెరిగి అవి త్వరగా పాడైపోతాయి. ఉల్లిపాయలను ఎప్పుడూ మంచి గాలి వెలుతురు తగిలే పొడి ప్రదేశంలో జాలి బుట్టల్లో మాత్రమే నిల్వ చేయాలి.

3 / 5
చాలా ఇళ్లలో చేసే మరో సాధారణ పొరపాటు బంగాళదుంపలు, ఉల్లిపాయలను ఒకే బుట్టలో కలిపి ఉంచడం. బంగాళదుంపల నుండి సహజంగా విడుదలయ్యే ఇథిలీన్ వాయువు, తేమ వల్ల ఉల్లిపాయలు వేగంగా మొలకలెత్తడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ రెండింటినీ ఎప్పుడూ వేర్వేరు బుట్టల్లో దూరంగా ఉంచాలి.

4 / 5
మార్కెట్‌కు వెళ్లినప్పుడు కాస్త ఓపికగా పరిశీలించి, నాణ్యమైన ఉల్లిపాయలను ఎంచుకుంటే నెలల తరబడి తాజాగా నిల్వ ఉంటాయి. ఆహారంలో నాణ్యత, కుటుంబ ఆరోగ్యం మనం ఎంచుకునే కూరగాయల పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి కొనుగోలు సమయంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

5 / 5
Follow Us