AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెట్టుకు వేలాడుతూ కనిపించిన యువకుడు.. చిన్న అనుమానంతో బయటపడ్డ భారీ స్కెచ్!

దాచేపల్లి మండలం పెదగార్లపాడులో చెట్టుకు వేలాడుతూ కనిపించిన షేక్ సైదా మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మొదట ఆత్మహత్యగా భావించినా, కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిందితులు మణికంఠ, స్నేహితులు లొంగిపోవడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

చెట్టుకు వేలాడుతూ కనిపించిన యువకుడు.. చిన్న అనుమానంతో బయటపడ్డ భారీ స్కెచ్!
Pedagarlapadu Murder
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 9:35 PM

Share

షేక్ సైదా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో నివసిస్తుంటాడు. అక్టోబర్ 19వ తేదీన గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందరూ ఆత్మహత్యగానే భావించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సైదాను చంపి ఉరివేసినట్లు భావించారు. ఇదే విషయాన్ని సైదా బంధువులు పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు దర్యాప్తులో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తేలింది. సైదా ఒక సిమెంట్ ప్యాక్టరీలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. తనతో పాటు పనిచేసే మరొక కూలీ భార్యతో సైదాకు వివాహేతర సంబంధం ఉంది. గత కొన్నేళ్లుగా అనైతిక బంధాన్ని కొనసాగుతున్నారు. సైదాకు ఇద్దరూ పిల్లలుండగా, ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈ నెల 19వ తేదీన రాత్రి సమయంలో సైదా.. సదరు మహిళా ఇంటికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో ఆమె సోదరుడు మణికంఠ తన ఇద్దరూ స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. తన చెల్లెలు ఇంటిలో నుండి సైదా రావడాన్ని గమనించి అతన్ని నిలదీశాడు. నా చెల్లెలు కాపురం పాడు చేయవద్దంటూ వేడుకున్నాడు. అయితే సైదా నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను నువ్వెవరివి ప్రశ్నించడానికి అంటూ దురుసుగా సమాధానం చెప్పాడు. దీంతో మాటామాటా పెరిగింది.

ఈ క్రమంలోనే మణికంఠ తన స్నేహితులతో కలిసి సైదా గొంతు నులిమి చంపేశారు. తాము చంపినట్లుగా బయటపడుకుండా ఉండాలన్న ఉద్దేశంతో వెంటనే సమీపంలోకి చేనులోకి తీసుకెళ్లి చెట్టుకు ఉరి వేశారు. ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తారని అనుకున్న ముగ్గురు అక్కడ నుండి పారిపోయారు. మొదట అందరూ ఆత్మహత్యగానే భావించారు. అయితే మృతుడి తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠతో పాటు అతని స్నేహితులైన ముస్తఫా, నాగూర్ వలీలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు గురజాల డిఎస్పీ ఉమామహేశ్వరావు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us