మందుల ముసుగులో మత్తు దందా..125 మెడికల్ షాపులకు నోటీసులు!
తెలంగాణలో మత్తుకు దారితీసే ఔషధాల అక్రమ విక్రయాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులను తనిఖీ చేసి, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, రికార్డుల నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణలను పరిశీలించిన తర్వాత లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రజల రోగాలను నయం చేసి ప్రాణాలు కాపాడాల్సిన మందులు.. ఇప్పుడు యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నాయా? చికిత్స కోసం వాడాల్సిన ఔషధాలే వ్యసనానికి దారితీస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ ‘హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్’ దందా తీవ్ర కలకలం రేపుతోంది. మెడికల్ షాపుల్లో విక్రయించే మందులు ఎవరికి చేరుతున్నాయి? దేనికోసం వాడుతున్నారు? అమ్మకాలపై నియంత్రణ ఉందా? అనే విషయాలపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైదరాబాద్ సిపిఎస్ పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కాప్రా, హబ్సిగూడ, ఉప్పల్, జీడిమెట్ల, బాలానగర్, మేడిపల్లి, షామీర్‌పేట వంటి ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మెడికల్ షాపుల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా ట్రామడాల్, ఆల్ప్రాజోలం, నైట్రాజెపామ్, టాపెంటడాల్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్ వంటి పవర్‌ఫుల్ టాబ్లెట్లతో పాటు, కోడిన్ కలిగిన దగ్గు సిరప్‌ల విక్రయాలపై ఆరా తీశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు ఇస్తున్నారా? అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి సరైన రికార్డులు నిర్వహిస్తున్నారా? అని నిశితంగా పరిశీలించారు. ఈ సోదాల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ చీటీ లేకుండానే మందులు అమ్మడం, షాపుల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకపోవడం, సరైన బిల్లులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా షెడ్యూల్ హెచ్1 డ్రగ్స్ రిజిస్టర్లు సరిగ్గా నిర్వహించకపోవడం, లెక్కల్లో భారీ తేడాలు ఉండటంతో నిబంధనలు ఉల్లంఘించిన 125 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెడిసిన్‌ను మత్తు కోసం దారిమళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నోటీసులు అందుకున్న షాపుల వివరణ ఆధారంగా లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఈ తనిఖీలతో అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Honey: తేనె అంటే వాంతేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
రిటైర్‌మెంట్ జీవితానికి బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!
కేవలం 7 రూపాయలు.. ఆమె జీవితాన్నే మార్చేశాయి!

