AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వానలు లేక వెలవెల.. తుఫాన్ తెలంగాణకు రిలీఫ్ ఇస్తుందా..? నీటి లెక్కలు ఇదిగో..

తెలంగాణను వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా వేధిస్తున్నాయి. జూన్ 1 నుంచి అక్టోబర్ 26 వరకు సాధారణం కంటే 25 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 834 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వలు.. ఇప్పుడు 503 టీఎంసీలకు పరిమితమయ్యాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాను రైతాంగానికి ఉపశమనాన్ని ఇస్తాయా..? ఈ తుఫాన్ వల్ల నీటి ఎద్దడి ఏమైన తగ్గుతుందా..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: వానలు లేక వెలవెల.. తుఫాన్ తెలంగాణకు రిలీఫ్ ఇస్తుందా..? నీటి లెక్కలు ఇదిగో..
Telangana Water Crisis
Siva Nagaraju
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 9:47 PM

Share

తెలంగాణలో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. దీంతో రైతులు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థతో వర్షాలు కురుస్తాయన్న ఆశలు పెరిగాయి. అయితే ఈ వర్షాలు రాష్ట్రంలోని నీటి కష్టాలను ఎంతవరకు తీరుస్తాయన్నది కీలకంగా మారింది. తాజా లెక్కల ప్రకారం.. తెలంగాణలో వర్షపాతం లోటు అక్టోబర్‌ నెలకే పరిమితం కాలేదు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 26 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 822 మి.మీ. కాగా, నమోదైనది 619 మి.మీ మాత్రమే. అంటే సుమారు 25 శాతం లోటు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. అక్టోబర్‌ 22 నాటికి 87 జలాశయాల్లో 470.55 TMC నీరు నిల్వ ఉంది. వాటి మొత్తం సామర్థ్యం 1,059 TMC. చిన్న నీటిపారుదల చెరువుల్లో అక్టోబర్‌ 9 నాటికి 93.51 TMC నీరు ఉంది. ఈ సమయంలో 12 జిల్లాల్లో ఒక్క చినుకు కూడా పడలేదు. హైదరాబాద్‌లోనూ వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. వర్షాలు లేకపోవడంతో పొలాల్లో తేమ తగ్గుతోంది. పంటలను కాపాడుకోవడానికి కొందరు రైతులు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు. దీంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. బోర్లపై ఆధారపడే రైతులకు విద్యుత్‌ అవసరం కూడా పెరుగుతోంది. మరోవైపు, రబీ పంటల సాగుపైనా వర్షాభావ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో నీరు ఎంత ఉంది వర్షాలు తగ్గడంతో జలాశయాల్లో నీటి నిల్వలపైనా ఒత్తిడి పెరుగుతోంది. అక్టోబర్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి