IND vs NZ 3rd T20I: 2 మ్యాచ్‌ల్లో 99 పరుగులు.. కట్‌చేస్తే.. 3వ మ్యాచ్ నుంచి టీమిండియా తోపు ఔట్..!
India vs New Zealand 3rd T20I: న్యూజిలాండ్ తో మూడవ టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఆడే విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ స్పష్టత ఇచ్చారు. ఇటీవలి ప్రదర్శనపై విమర్శల నేపథ్యంలో, భువనేశ్వర్‌కు మద్దతుగా నిలిచిన మార్కెల్, అతడి నైపుణ్యం జట్టుకు ఉపయోగపడుతుందని, పునరాగమనంలో సమయం ఇవ్వాలని కోరారు. దీంతో భువి 3వ టీ20లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

India vs New Zealand 3rd T20I: న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాలోకి సుదీర్ఘ విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జాతీయ జట్టు తరఫున మైదానంలో అడుగుపెట్టిన భువనేశ్వర్, ఇప్పటివరకు కివీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో కలిపి 99 పరుగులను ధారాళంగా సమర్పించుకొని కేవలం ఒకే ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో పునరాగమనాన్ని ఆశించిన స్థాయిలో కొనసాగించలేకపోతున్నాడంటూ అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన అనుభవం ఉన్నప్పటికీ, జాతీయ జట్టు తరఫున ఆడిన రెండు మ్యాచులలోనూ భువనేశ్వర్ విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
ఈ విమర్శల పరంపర నేపథ్యంలో, టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ భువనేశ్వర్ కు పూర్తి మద్దతుగా నిలిచారు. భువనేశ్వర్ కుమార్ పునరాగమనం జట్టుతో పాటు అభిమానులందరికీ సంతోషాన్ని ఇచ్చిందని మార్కెల్ అన్నారు. అయితే, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వచ్చాడు కాబట్టి, సహజంగానే అతడిపై అంచనాలు అదే స్థాయిలో ఉంటాయని మార్కెల్ నొక్కి చెప్పారు. నిజానికి ఐపీఎల్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని గుర్తుచేసిన మార్కెల్, అంచనాలు కొన్నిసార్లు క్రీడాకారులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయని అన్నారు. ఈ ఒత్తిడిని భువనేశ్వర్ అధిగమించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ లోడింగ్.. రోకో జోడీ బయల్దేరేది ఎప్పుడంటే?
భువనేశ్వర్ కు ప్రాక్టీస్ కోసం లభించిన సమయం గురించి కూడా మార్కెల్ ప్రస్తావించారు. భువి కేవలం నెల రోజుల నుంచి మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాడని, జాతీయ స్థాయిలో ఆడడం అనేది మిగతా వాటికి కాస్త భిన్నంగా ఉంటుందని ఆయన వివరించారు. జట్టు షెడ్యూల్ కారణంగా అతడికి ప్రాక్టీస్ చేసేందుకు ఎక్కువగా సమయం దొరకలేదని మార్కెల్ అన్నారు. అయినప్పటికీ, భువనేశ్వర్ నైపుణ్యం, అనుభవం ఖచ్చితంగా జట్టుకు ఉపయోగపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భువనేశ్వర్ జట్టులో నిలదొక్కుకునేందుకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, రాబోయే మ్యాచ్‌లలో తన నుంచి మంచి ప్రదర్శన వస్తుందని ఆశిస్తున్నట్లు మార్కెల్ తెలిపారు. అదేవిధంగా, బయటి నుంచి వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోర్న్ మార్కెల్ 36 ఏళ్ల భువనేశ్వర్‌కు బహిరంగంగా అండగా నిలిచారు.
ఎక్కువమంది చదివినది: Tilak Varma: టీ20ల్లో కోహ్లీ వారసుడు ఇతనే.. ఛేజింగ్ అంటే చిర్రెత్తిపోతున్నాడుగా..!
కాగా, న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి రెండు టీ20లలో భారత్ ఘన విజయం సాధించింది. మూడో టీ20లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య రేపు మంగళవారం నాడు మూడో టీ20 మ్యాచ్‌కు వెల్లింగ్టన్ వేదిక కానుంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది. మొత్తానికి, బౌలింగ్ కోచ్ మోర్న్ మార్కెల్ మాటలను బట్టి చూస్తే, కీలకమైన మూడవ టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ ఆడటం పక్కా కాయంగా కనిపిస్తుంది. అతడి అనుభవం, మార్కెల్ మద్దతుతో భువనేశ్వర్ రాబోయే మ్యాచ్‌లలో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




