Tilak Varma: టీ20ల్లో కోహ్లీ వారసుడు ఇతనే.. ఛేజింగ్ అంటే చిర్రెత్తిపోతున్నాడుగా..!
T20I Chasing Record: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో లక్ష్య ఛేదన సమయంలో కనీసం 500 పరుగులు చేసిన బ్యాటర్లలో 50కిపైగా బ్యాటింగ్ సగటు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అగ్రస్థానంలో ఉన్నాడు.

T20I Chasing Record: టీ20 క్రికెట్‌లో లక్ష్య ఛేదన సమయంలో నిలకడగా పరుగులు చేయడం అంత సులభం కాదు. ఒత్తిడిలో వికెట్ కాపాడుకుంటూ వేగంగా పరుగులు సాధించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో తిలక్ వర్మ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఛేజింగ్ సమయంలో కనీసం 500 పరుగులు చేసిన బ్యాటర్లలో తిలక్ వర్మ ఏకంగా 51.62 సగటుతో కొనసాగుతున్నాడు. ఈ గణాంకంతో 50కిపైగా సగటు కలిగిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ 67.10 సగటుతో ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు.
ఈ జాబితాలో మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) 47.71 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ జేపీ డుమినీ (JP Duminy) 45.55 సగటుతో నాలుగో స్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) 44.93 సగటుతో ఐదో స్థానంలో ఉన్నాడు.
టీ20 ఛేజింగ్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు:
విరాట్ కోహ్లీ – 67.10
తిలక్ వర్మ – 51.62
ఎంఎస్ ధోని – 47.71
జేపీ డుమినీ – 45.55
కుమార సంగక్కర – 44.93
తిలక్ వర్మకు ఈ రికార్డు మరింత ప్రత్యేకం. కోహ్లీ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్ తర్వాత ఈ జాబితాలో చోటు సంపాదించడం అతని టీ20 బ్యాటింగ్‌లోని స్థిరత్వాన్ని తెలియజేస్తోంది. ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం తిలక్‌కు బలంగా మారింది.
భారత్ టీ20 జట్టులో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఎదుగుతున్న తిలక్.. ఛేజింగ్‌లో తన రికార్డును మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఈ గణాంకం అతని భవిష్యత్ టీ20 కెరీర్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
