పౌర్ణమి రోజున చేయాల్సిన, చేయకూడని పనులు గురించి జ్యోతిష్య నిపుణులు కొన్ని ముఖ్య సూచనలు చేశారు.
చేయాల్సిన, చేయకూడని పనులు
పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం కూడా చాలా శుభప్రదం. ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరి, అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి.
సత్యనారాయణ స్వామి వ్రతం
ఈ రోజున ఏ పూజ చేసినా సుఖమైన ప్రాప్తి, ధన లాభం లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచించారు.
ధన లాభం
పౌర్ణమి రోజున తెల్లవారుజామున 5 నుండి 6 గంటల లోపు పూజ చేయాలి.అమ్మవారికి బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పించి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
బెల్లం పాయసం
ఇతరులను దూషించడం, పెద్దలను అవమానించడం లేదా దేవతా దూషణ చేయడం చేయకూడదు.
ఇతరులను దూషించడం
ఇంటికి వచ్చిన అతిథులను "నా దగ్గర లేదు" అనే మాటతో పంపకూడదు. వారికి చేతనైనంత సహాయం చేయాలి.
చేతనైనంత సహాయం
ఇంట్లోని పెద్దవారిని, తల్లిదండ్రులను గౌరవించాలి. వారికి నమస్కారం చేసుకోవాలి.
తల్లిదండ్రులను గౌరవించాలి
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.