AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సున్నుండని మించిన శక్తి, బలం ఇచ్చే అద్భుతమైన స్వీట్!

తెలుగువారి సాంప్రదాయ వంటకాల్లో బలానికి, నడుము దృఢత్వానికి మినప సున్నుండలు తిరుగులేనివిగా భావిస్తారు. అయితే సున్నుండలు చేయాలంటే ఎక్కువ పరిమాణంలో పంచదార లేదా నెయ్యి పోయాల్సి ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా.. పంచదార అస్సలు లేకుండా కేవలం ఒక్క టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యితో, సున్నుండల కంటే పది రెట్లు ఎక్కువ శక్తినిచ్చే ఒక అపురూపమైన ప్రోటీన్ స్వీట్‌ను చాలా తేలికగా తయారుచేసుకోవచ్చు. ఎదుగుతున్న పిల్లలకు, మహిళలకు, ఎముకల బలహీనత ఉన్నవారికి ఇది దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది.

Phani CH
|

Updated on: Oct 26, 2026 | 6:07 PM

Share
కావలసిన పదార్థాలు: 1 కప్పు నిండుగా మినపగుళ్లు,  అర కప్పు పెసరపప్పు, 1½ కప్పుల తురిమిన బెల్లం, బెల్లం కరిగించడానికి 1½ కప్పుల నీళ్లు, 1 కప్పు కాచిన పాలు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 2 యాలకులు, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ 3 నుండి 4 టేబుల్ స్పూన్లు, వేయించిన గసగసాలు – 1 టేబుల్ స్పూన్

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి 1 కప్పు నిండుగా మినపగుళ్లను వేయాలి. మంటను పూర్తిగా సన్నటి సెగపై ఉంచి గరిటెతో కలుపుతూ పప్పు లోపలి నుండి వేగేలా వేయించాలి. మినపగుళ్లు కాస్త రంగు మారడం ప్రారంభించాక అర కప్పు పెసరపప్పును కూడా వేయాలి. రెండూ కలిసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కమ్మటి సువాసన వచ్చేవరకు వేయించి.. వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

2 / 5
గిన్నెలో కప్పున్నర తురిమిన బెల్లం, కప్పున్నర నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. ఎటువంటి తీగ పాకం అవసరం లేదు; బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మినపగుళ్లు, పెసరపప్పును మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో 2 యాలకులు మరియు నేతిలో వేయించిన బాదం, జీడిపప్పు, ఫూల్ మఖానా (3-4 టేబుల్ స్పూన్లు) వేయాలి. ఏమాత్రం పలుకు లేకుండా చాలా మెత్తటి ఫైన్ పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోవచ్చు.

3 / 5
పాన్‌లో కరిగించిన బెల్లం నీటిని స్ట్రైనర్‌తో నలకలు లేకుండా వడకట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి.. మిక్సీ పట్టుకున్న పప్పుల పిండిని కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో ఉండలు లేకుండా వేగంగా కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత 1 కప్పు పాలలో ముందుగా అర కప్పు పాలు పోసి బాగా కలపాలి; అది ఇమిడిపోయాక మిగిలిన అర కప్పు పాలు కూడా పోసి లో-మీడియం మంటపై కలుపుతూ ఉడికించాలి. సుమారు 5-6 నిమిషాల్లో మిశ్రమం పాన్ నుండి విడివడి ముద్దలా గట్టిపడుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కాస్త గోరువెచ్చగా చల్లారనివ్వాలి.

4 / 5
గోరువెచ్చగా ఉన్న మిశ్రమాన్ని చాపింగ్ బోర్డుపై లేదా బటర్ పేపర్‌పై ఉంచి పొడవాటి స్థూపాకారంలో (సిలిండర్ లాగా) రోల్ చేసుకోవాలి. దీనిపై వేయించిన గసగసాలు చల్లి రోల్‌ను తిప్పుతూ గసగసాలు అంటుకునేలా చేయాలి. ఇప్పుడు కత్తి వాడకుండా.. ఒక శుభ్రమైన దారాన్ని రోల్ కింద పెట్టి పైకి క్రాస్ చేసి లాగితే పర్ఫెక్ట్ రౌండ్ షేప్‌లో స్వీట్ పీసెస్ సులభంగా కట్ అవుతాయి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'మినప-పెసర స్వీట్ రోల్స్' సిద్ధం! నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ.. గాలి చొరబడని డబ్బాలో ఉంచితే 15 నుండి 20 రోజుల పాటు తాజాగా ఉండి పిల్లల ఎదుగుదలకు, పెద్దల ఎముకల దృఢత్వానికి అపారమైన బలాన్నిస్తాయి!

5 / 5
Follow Us