AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త రూల్.. ఫోన్‌లో సిమ్ లేకపోతే యాప్ పనిచేయదా?

WhatsApp New Rules: మెసేజింగ్ యాప్స్‌ను సురక్షితంగా ఉంచడం, సైబర్ మోసాలను తగ్గించడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. అయితే 2027 జనవరి 1 నుంచి ప్రతి వినియోగదారుడి వాట్సాప్ అకౌంట్ తప్పనిసరిగా నిలిచిపోతుందని అర్థం కాదు. రిజిస్టర్డ్ సిమ్‌ను ఫోన్‌లో యాక్టివ్‌గా..

WhatsApp యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త రూల్.. ఫోన్‌లో సిమ్ లేకపోతే యాప్ పనిచేయదా?
Whatsapp
Subhash Goud
|

Updated on: Oct 26, 2026 | 5:34 PM

Share

WhatsApp: వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కొత్త సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో వాట్సాప్ సహా పలు మెసేజింగ్ యాప్స్ వినియోగించే విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

సిమ్ బైండింగ్ అంటే ఏమిటి?:

ప్రస్తుతం చాలామంది తమ మొబైల్ నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత, ఆ సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసేస్తున్నారు. అయినప్పటికీ వైఫై లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే కొత్త సిమ్ బైండింగ్ నిబంధనల ప్రకారం, మెసేజింగ్ యాప్ అకౌంట్‌కు అనుసంధానమైన సిమ్ కార్డు సంబంధిత ఫోన్‌లోనే ఉండి, యాక్టివ్‌గా ఉండేలా యాప్‌లు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్టర్డ్ సిమ్‌ను తొలగించడం లేదా అది పనిచేయకుండా పోవడం వల్ల యాప్ సేవలకు అంతరాయం కలగవచ్చు.

ఎందుకు ఈ కొత్త నిబంధన?:

దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సైబర్ నేరగాళ్లు భారత మొబైల్ నంబర్లతో మెసేజింగ్ యాప్స్‌లో అకౌంట్లు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత సిమ్ కార్డులను తొలగించినా, ఇంటర్నెట్ ద్వారా ఆ అకౌంట్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి అకౌంట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) సిమ్ బైండింగ్ నిబంధనలను తీసుకొచ్చింది.ఈ విధానం ద్వారా నకిలీ గుర్తింపులతో జరిగే మోసాలు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్ట్ పేరుతో చేసే మోసాలను నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిబంధన ఒక్కటే అన్ని రకాల సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టలేదు.

ఏయే యాప్స్‌పై ప్రభావం ఉంటుంది?

ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే మెసేజింగ్ యాప్స్‌లో ప్రధానంగా ఈ యాప్స్ ఉన్నాయి:

  • వాట్సాప్ (WhatsApp)
  • టెలిగ్రామ్ (Telegram)
  • సిగ్నల్ (Signal)
  • స్నాప్‌చాట్ (Snapchat)
  • జియోచాట్ (JioChat)
  • అరట్టై (Arattai)
  • షేర్‌చాట్ (ShareChat)
  • జోష్ (Josh)

ఫోన్‌లో రెండు సిమ్‌లు ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయా?

సాధారణంగా రెండు సిమ్ కార్డులు ఉపయోగించే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీరు వాట్సాప్ అకౌంట్‌ను ఏ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేశారో, ఆ నంబర్‌కు సంబంధించిన సిమ్ కార్డు మీ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మీరు ఒక నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించి, ఆ సిమ్‌ను వేరే ఫోన్‌లో ఉంచి, మీ ప్రధాన ఫోన్‌లో వైఫై ద్వారా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటే కొత్త నిబంధనల వల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల మీ వాట్సాప్ అకౌంట్‌కు అనుసంధానమైన సిమ్ కార్డు ఏ ఫోన్‌లో ఉందో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

మెసేజింగ్ యాప్స్‌ను సురక్షితంగా ఉంచడం, సైబర్ మోసాలను తగ్గించడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. అయితే 2027 జనవరి 1 నుంచి ప్రతి వినియోగదారుడి వాట్సాప్ అకౌంట్ తప్పనిసరిగా నిలిచిపోతుందని అర్థం కాదు. రిజిస్టర్డ్ సిమ్‌ను ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంచడం ద్వారా వినియోగదారులు కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: House Slab: ఇంటి స్లాబ్ వేస్తున్నప్పుడు వర్షం పడితే ఏమవుతుంది? స్లాబ్ బలం తగ్గుతుందా.. లీకేజీలు వస్తాయా? ఎవ్వరికి తెలియని విషయాలివే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జనవరి 1 నుంచి కొత్త రూల్..ఫోన్‌లో సిమ్ లేకపోతే WhatsApp పనిచేయదా?
జనవరి 1 నుంచి కొత్త రూల్..ఫోన్‌లో సిమ్ లేకపోతే WhatsApp పనిచేయదా?
కుజ దృష్టితో వీరికి గోల్డెన్ డేస్..! ప్రేమ,పెళ్లి ప్రయత్నాలు సఫలం
కుజ దృష్టితో వీరికి గోల్డెన్ డేస్..! ప్రేమ,పెళ్లి ప్రయత్నాలు సఫలం
బాయ్ ఫ్రెండ్‌తో పారిపోవాలనుకున్న బాలిక.. ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్!
బాయ్ ఫ్రెండ్‌తో పారిపోవాలనుకున్న బాలిక.. ఇంటర్‌లో స్టేట్ ర్యాంక్!
ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?
ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?
ఊసరవెల్లి రంగులు మార్చడం వెనక ఇంత పెద్ద కథ ఉందా..
ఊసరవెల్లి రంగులు మార్చడం వెనక ఇంత పెద్ద కథ ఉందా..
ప్రకృతిని కాపాడే చేతులపైనే చెత్త దాడి..!
ప్రకృతిని కాపాడే చేతులపైనే చెత్త దాడి..!
కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా ఫిట్నెస్.. 64 ఏళ్ల వయసులో ...
కుర్రాళ్లు సైతం కుళ్లుకునేలా ఫిట్నెస్.. 64 ఏళ్ల వయసులో ...
భారత్‌లో కార్ల అమ్మకాలతో ఎలాన్‌ మస్క్‌కు ఎంత ఆదాయమో తెలుసా?
భారత్‌లో కార్ల అమ్మకాలతో ఎలాన్‌ మస్క్‌కు ఎంత ఆదాయమో తెలుసా?
CBSE విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు
CBSE విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి 12వ తరగతి వరకు AI పాఠాలు
మూడో టీ20లో అభిషేక్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరో తేలిపోయిందా..!
మూడో టీ20లో అభిషేక్‌తో ఓపెనింగ్ చేసేది ఎవరో తేలిపోయిందా..!