చపాతీలపై ఆవిరి చేరకుండా.. పొడిగా, మెత్తగా ఉండాలంటే!
25 October 2026
TV9 Telugu
TV9 Telugu
చపాతీలు కాల్చిన వెంటనే నేరుగా ప్యాన్‌పై నుంచి తీసి హాట్‌బాక్స్‌లో వేస్తుంటారు చాలామంది. ఆపై మూత పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చపాతీలపై ఆవిరి చేరుతుంది
TV9 Telugu
కాబట్టి ఒక నిమిషం పాటు చపాతీల్ని మెష్ ప్లేట్లో ఉంచి.. ఆపై హాట్‌బాక్స్‌లో పెట్టి మూత పెట్టాలి. దీనివల్ల చపాతీ పైన, కింద భాగం నుంచి వేడి పొగలు బయటికి వెళ్లిపోయి.. ఆవిరి పేరుకుపోకుండా ఉంటుంది
TV9 Telugu
హాట్‌బాక్స్‌లో చపాతీల్ని నేరుగా పెట్టకుండా అడుగున, పైభాగంలో.. మందపాటి కాటన్ క్లాత్ లేదంటే టిష్యూ పేపర్‌ని ఉంచాలంటున్నారు నిపుణులు
TV9 Telugu
దీనివల్ల ఇవి ఆవిరిని పీల్చుకొని.. చపాతీలను పొడిగా, మెత్తగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో చపాతీల్ని ప్యాక్ చేయాల్సి వస్తే.. మధ్యమధ్యలో టిష్యూలను ఉంచడం మేలంటున్నారు.
TV9 Telugu
కాల్చిన చపాతీల్ని నిమిషం పాటు బయట ఉంచి హాట్‌బాక్స్‌లో పెట్టినా.. కొన్నిసార్లు ఆవిర్లు అడుగున, పైన ఉండే చపాతీల్ని జిగటగా మారుస్తాయి
TV9 Telugu
ఇలా జరగకుండా బాక్స్ అడుగున చిన్న మెష్ స్టాండ్ ఉంచి.. వాటిపై చపాతీల్ని ఉంచాలి. ఇక పైభాగంలో కూడా స్టాండ్ ఉంచి మూత పెట్టేస్తే.. ఆవిర్లు చపాతీల పైకి చేరకుండా ఉంటుంది
TV9 Telugu
బిరియానీ ఆకులు వంటకాలకు రుచిని, సువాసనను అందించడమే కాదు.. చపాతీలపై ఆవిర్లు చేరకుండానూ నివారిస్తాయంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఈ క్రమంలో హాట్‌బాక్స్ అడుగున ఒక కాటన్ క్లాత్ పరిచి.. దానిపై రెండు లేదా మూడు బిరియానీ ఆకుల్ని పేర్చి.. ఆపై చపాతీల్ని ఉంచాలి. ఇలా చేస్తే చపాతీలు పొడిగా, మృదువుగా ఉంటాయి