వాట్సాప్ యూజర్ల కోసం మెటా సంస్థ ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను తమ స్నేహితులతో పంచుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన, లైక్ చేసిన లేదా సేవ్ చేసిన రీల్స్‌ను వాట్సాప్‌లో షేర్ చేయాలనే కోరిక యూజర్లలో ఎక్కువగా ఉంటుంది. ఈ అవసరాన్ని గుర్తించిన మెటా, వాట్సాప్ అటాచ్‌మెంట్ మెనూలో ఒక ప్రత్యేక షార్ట్‌కట్ బటన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో, యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోకి వెళ్లే అవసరం లేకుండానే, వాట్సాప్ నుండే తాము ఇటీవల చూసిన, లైక్ చేసిన లేదా సేవ్ చేసిన రీల్స్‌ను నేరుగా బ్రౌజ్ చేసి, ఎంపిక చేసుకొని తమ ఫ్రెండ్స్‌కి పంపియొచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తమ వాట్సాప్ అకౌంట్‌ను మెటా అకౌంట్ సెంటర్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ సౌకర్యం సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుంది.