గూగుల్ పే, ఫోన్ పే ద్వారా జరిపే యూపీఐ లావాదేవీలు విఫలమైతే కంగారు పడనక్కర్లేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు నిర్ణీత గడువులోగా మీ డబ్బును తిరిగి జమ చేయాలి. ఆలస్యమైతే రోజుకు ₹100 పరిహారం చెల్లించాలి. ఒకవేళ రీఫండ్ కాకపోతే, యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేసి, అవసరమైతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి.