AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 సంక్రాంతి రిలీజ్ పై మళ్లీ మొదలైన మెగా కన్ఫ్యూజన్

2027 సంక్రాంతి రిలీజ్ పై మళ్లీ మొదలైన మెగా కన్ఫ్యూజన్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 26, 2026 | 9:32 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి 2027 సంక్రాంతికి ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’, వశిష్ట రూపొందిస్తున్న ‘విశ్వంభర’ విడుదల తేదీలపై ఇంకా స్పష్టత లేదని ప్రచారం జరుగుతోంది. ‘కాకా’ను జనవరి 13న విడుదల చేయాలని ముందుగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు ‘విశ్వంభర’ను కూడా సంక్రాంతికి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, 2027 సంక్రాంతి బరిలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ పండగకు మెగాస్టార్ నుంచి ఏ సినిమా రాబోతుందనే విషయంలో మాత్రం మెగా కాంపౌండ్‌లో మళ్లీ కన్ఫ్యూజన్ మొదలైంది. ‘కాకా’, ‘విశ్వంభర’ సినిమాల రిలీజ్ డేట్స్‌ విషయంలో క్లారిటీ రాకపోవటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. ఆగస్టులో రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. ఈ మూవీని జనవరి 13న పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే డిసెంబర్ రెండో వారం కల్లా బ్యాలెన్స్ 30 శాతం షూటింగ్ పూర్తి చేసేలా బాబీ పక్కా ప్లాన్‌తో దూసుకెళ్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ను కూడా సంక్రాంతి బరిలోనే దింపాలని యూవీ క్రియేషన్స్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఓటీటీ నుంచి మంచి డీల్ రావాలంటే జనవరిలోనే థియేట్రికల్ రిలీజ్ ఉండాలనే కండిషన్ నిర్మాతలకు పెద్ద చిక్కుముడిగా మారింది. ‘విశ్వంభర’ ఫైనల్ కాపీ చూశాకే రిలీజ్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారట. ఆ సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వస్తే, ఇప్పటికే ఆలస్యమైన ‘విశ్వంభర’ కోసం.. ‘కాకా’ డైరెక్టర్ బాబీ, నిర్మాతలను చిరు కన్విన్స్ చేసే ఛాన్స్ ఉంది. పండగకు ఇంకా 70 రోజుల సమయమే ఉండటంతో, ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి చిత్రయూనిట్‌ ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాల్సి ఉంది. మరి సంక్రాంతికి వచ్చేది ‘కాకా’నా లేక ‘విశ్వంభర’నా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Honey: తేనె అంటే వాంతేనా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!

రిటైర్‌మెంట్‌ జీవితానికి బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!

కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!

కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!

Follow Us