రామాయణంలో సీత పాత్ర అలా మిస్సయింది.. హీరోయిన్ క్లారిటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
26 October 2026
‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న క్రైమ్ కామెడీ చిత్రం ఆదర్శ కుటుంబం చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా గతంలో ఎంతో చర్చనీయాంశమైన రామాయణ సినిమాలో సీత పాత్ర తనకు ఎందుకు దక్కలేదనే విషయంపై స్పష్టతనిచ్చారు.
కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ సమయంలోనే ప్రతిష్టాత్మక రామాయణ చిత్రంలో సీత పాత్ర కోసం తనను ఆడిషన్స్‌కు ఆహ్వానించారని శ్రీనిధి తెలిపారు.
ముంబై వెళ్లి ఆడిషన్స్‌తో పాటు లుక్ టెస్ట్‌లోనూ పాల్గొన్నట్లు చెప్పారు. ఆ పాత్ర కోసం తనతో పాటు మరో ముగ్గురిని పరిశీలించారని చెప్పుకొచ్చారు.
మేకర్స్ తమకు తగినట్లుగా భావించిన బెస్ట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. అంతపెద్ద ప్రాజెక్ట్‌లో సీత పాత్ర కోసం తనను పరిశీలనలోకి తీసుకోవడమే
తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, అయితే కొందరు ప్రచారం చేసినట్లుగా తనను రిజెక్ట్ చేశారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఇటీవల విడుదలైన రామాయణ ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని అన్నారు. రామయాణ చిత్రం గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్