AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మరో ప్రయోగానికి సిద్ధమైన సమంత.. మూడు నెలలపాటు కఠిన శిక్షణకు సిద్ధం..

Samantha: సమంత పేరు వినగానే క్యూట్‌, గ్లామర్‌ హీరోయిన్‌ అనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఏం మాయ చేశావే నుంచి సమంత దాదాపు అన్ని సినిమాల్లో ఇలాంటి పాత్రలనే పోషిస్తూ వచ్చింది. అయితే 2021లో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' సిరీస్‌ ద్వారా...

Samantha: మరో ప్రయోగానికి సిద్ధమైన సమంత.. మూడు నెలలపాటు కఠిన శిక్షణకు సిద్ధం..
Samantha
Narender Vaitla
|

Updated on: Aug 25, 2022 | 2:38 PM

Share

Samantha: సమంత పేరు వినగానే క్యూట్‌, గ్లామర్‌ హీరోయిన్‌ అనే భావన అందరిలోనూ కలుగుతుంది. ఏం మాయ చేశావే నుంచి సమంత దాదాపు అన్ని సినిమాల్లో ఇలాంటి పాత్రలనే పోషిస్తూ వచ్చింది. అయితే 2021లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ ద్వారా తన స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌తో పాటు యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించి మెప్పించింది. ఈ సిరీస్‌తో సమంత ఒక్కసారిగా ఇండియా దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం సమంతకు బాలీవుడ్‌లో వరుస అకాశాలు క్యూ కడుతున్నాయంటే దానికి ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించి రాజ్‌, డీకే దర్శకత్వంలో కొత్త వెబ్‌ సిరీస్‌లోనూ సమంత నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో సమంతకు జోడిగా వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నాడు. ఫ్యామిలీ మ్యాన్‌తో పోలిస్తే ఈ సిరీస్‌లో యాక్షన్‌ సన్నివేశాలు మరిన్ని ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఇందుకోసమే మేకర్స్‌ నటీనటులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అమెరికా వెబ్‌ సిరీస్‌ సిట్టాల్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ రోల్‌లో నటించనుంది.

ఇందుకోసం ఏకంగా మూడు నెలల పాటు కఠిణ శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని టాక్‌. మరి ఇప్పటి వరకు గ్లామర్‌ డోస్‌తో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన సామ్‌ యాక్షన్‌తో ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..