AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie Review: ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన భారీ మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ OG . ఆకాశమంత అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. మరి నిజంగానే పవన్ సినిమా ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

OG Movie Review: ఓజీ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే?
Pawan Kalyan OG Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Basha Shek|

Updated on: Sep 25, 2025 | 4:53 AM

Share

మూవీ రివ్యూ: OG

నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు..

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రాఫర్: రవి కే చంద్రన్

సంగీతం: తమన్

నిర్మాత: డివివి దానయ్య

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజిత్

కథ:

1970లలో జపాన్ నుంచి కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్య దాదా (ప్రకాష్ రాజ్). ఆయనతో పాటు ఓజస్ గంభీర (పవన్ కళ్యాణ్) కూడా ముంబై వస్తాడు. సత్యా దాదా చుట్టూ ఒక కోటలా నిలబడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ముంబై వదిలి వెళ్ళిపోతాడు గంభీరా. ఆయన వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఓమి (ఇమ్రాన్ హష్మీ) ముంబైలో అడుగుపెట్టి గంభీర మనుషులను చంపేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ముంబైకి వస్తాడు ఓజాస్ గంభీరా. అప్పుడు ఏం జరిగింది.. మధ్యలో ఈ కన్మణి (ప్రియాంక మోహన్) ఎవరు.. ఆమె గంభీర జీవితంలోకి ఎలా వచ్చింది.. అసలు ఓమి ఏమేం చేయాలనుకున్నాడు.. అనేది మిగిలిన కథ..

కథనం:

నిజం చెప్పాలంటే ఓజీ చాలా సింపుల్ కథ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాహో సినిమాను కాస్త మార్చి మళ్లీ దానికి మాఫియా బ్యాక్ డ్రాప్ పెట్టి తీశాడు సుజిత్. కాకపోతే అందులో చేసిన తప్పులు ఇందులో చేయలేదు. చూడడానికి చాలా రొటీన్ కథలాగా అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు.. ఆయన ఆరా ఈ సినిమా కథను నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్‌తో ఎమోషనల్ బ్యాక్‌స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు సుజీత్. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు.. అది కూడా మాములు హై కాదు.. సుజిత్ రాసుకున్న సీన్లకు.. అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్. ఫస్టాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్.. పూనకాలు వచ్చేసాయి.. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్.. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది కానీ.. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజీత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది.. తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో.. అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ ని అనే పేరు చుట్టూ తిప్పేసాడు.. ఒక్కటైతే నిజం.. ఇన్నేళ్ళ కెరీర్ లో పవర్ స్టార్ ను ఇంత పవర్ ఫుల్ గా ఎవరు చూపించలేదు.

నటీనటులు:

ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఎమోషన్.. అటు యాక్షన్ రెండు దుమ్ము దులిపేసాడు. ఇమ్రాన్ హష్మీ విలనిజం బాగుంది. ప్రకాష్ రాజ్ పాత్ర చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో నటించిన కూడా బాగుంది. శ్రేయ రెడ్డి, హరీష్ ఉత్తమన్ ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. మామూలు సన్నివేశం కూడా తన రీ రికార్డింగ్ తో నిలబెట్టేసాడు. ఎడిటింగ్ పర్లేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సుజిత్ దర్శకుడిగా తన స్టైల్ చూపించాడు. సెకండాఫ్ అక్కడక్కడ స్లో అయింది కాని ఎలివేషన్స్ మీద సినిమా నడిపించేసాడు. డివివి దానయ్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

పంచ్ లైన్:

OG.. ఫ్యాన్స్ కు ఫీస్ట్.. పండగ బొమ్మ..!