AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Hearts Movie Review : లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ.. యూత్‎‏ఫుల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య హసన్. ఈయన నిర్మాతగా మారి చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి ఇందులో హీరోగా నటించాడు. అంతకు ముందు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లోనూ కనిపించాడు మౌళీ. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూసి చూద్దాం..

Little Hearts Movie Review : లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ.. యూత్‎‏ఫుల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే..
Little Hearts Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Sep 05, 2025 | 9:29 AM

Share

మూవీ రివ్యూ: లిటిల్ హార్ట్స్

నటీనటులు: మౌళి తనూజ్, శివాని నగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ తదితరులు సంగీతం: సింజిత్ యెర్రమల్లి

ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ

నిర్మాత: ఆదిత్య హసన్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సాయి మార్తాండ్

90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఆదిత్య హసన్. ఈయన నిర్మాతగా మారి చేసిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూసి చూద్దాం..

కథ:

ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్ లో ఫెయిల్‌ అయిన అఖిల్‌ (మౌళి) బీటెక్ సీట్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లో చేరుతాడు. అక్కడ కాత్యాయని (శివాని నాగారం)ను కలుస్తాడు. ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు. ఐ లవ్ యు చెప్పిన తర్వాత కాత్యాయని చెప్పిన విషయం అఖిల్ ను డైలమాలో పడేస్తుంది. అక్కడినుంచి అతని ప్రేమకథ మలుపులు తిరుగుతుంది. మరోవైపు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు అని కలలు కంతుంటాడు గోపాలరావు (రాజీవ్ కనకాల). ఇక మొదట అఖిల్ ప్రేమను పురస్కరించినా కూడా.. తర్వాత ఓకే చెప్తుంది కాత్యాయని. వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా పెళ్లి చేసుకున్నారా లేదా అనేది అసలు కథ..

కథనం:

నో కథ.. నో కాకరకాయ్.. ఓన్లీ ఎంజాయ్. ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగితే.. లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది. చూస్తున్నంత సేపు నవ్వుకుంటే చాలు అన్నట్టు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్. ఎక్కడా సీరియస్ నెస్ ఉండదు.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్.. డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఎపిసోడ్స్ వైజ్ గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి. అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు.. కొన్ని హిలేరియస్ సీక్వెన్స్ లు ఉన్నాయి సినిమాలో. మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ కడుపులు చెక్కలు చేసింది. మౌళి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.. 2 గంటలు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. రాజీవ్ కనకాల, మౌళి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే ఎస్ఎస్ కాంచి సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీ మొత్తం చూడగలిగే సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.

నటీనటులు:

మౌళి బాగున్నాడు.. బాగా చేశాడు కూడా. మనోడు కామెడీ టైమింగ్ బాగుంది. కాకపోతే ఒకటే ఎక్స్ప్రెషన్ రిపీట్ చేసినట్టు ఉంటుంది. శివాని నగరం పర్లేదు.. బానే చేసింది. హీరో ప్రెండ్ క్యారెక్టర్ అదిరిపోయింది.. మనోడి పంచులు నెక్స్ట్ లెవెల్. రాజీవ్ కనకాల కూడా చాలా బాగా నటించాడు. అనిత చౌదరి పర్లేదు. మిగిలిన వాళ్ళందరూ ఓకే..

టెక్నికల్ టీం:

సింజిత్ యెర్రమల్లి అందించిన సంగీతం చాలా ఫ్రెష్ గా ఉంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది. డైరెక్టర్ సాయి మార్తాండ్ తను అనుకున్న ఎంటర్ టైన్మెంట్ అందించాడు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాకు మంచి రిలీజ్ ఇచ్చారు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా లిటిల్ హార్ట్స్.. నో లాజిక్.. జస్ట్ ఎంజాయ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ..!

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..