AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghaati Movie Review: ఘాటి మూవీ రివ్యూ.. అనుష్క ఖాతాలో హిట్ పడ్డట్టేనా..? సినిమా ఎలా ఉందంటే

హరిహర వీరమల్లు సినిమా నుంచి పక్కకు వచ్చి మరి అనుష్కతో ఘాటి సినిమా చేశాడు క్రిష్ జాగర్లమూడి. మరి పవన్ కళ్యాణ్ సినిమాను పక్కనపెట్టి మరి క్రిష్ చేసిన సినిమా ఎలా ఉంది.. ఘాటి స్వీటీ కోరుకున్న హిట్టు ఇచ్చిందా లేదా అనేది చూద్దాం.. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ghaati Movie Review: ఘాటి మూవీ రివ్యూ.. అనుష్క ఖాతాలో హిట్ పడ్డట్టేనా..? సినిమా ఎలా ఉందంటే
Anushka Ghaati
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 05, 2025 | 3:18 PM

Share

మూవీ రివ్యూ: ఘాటి

నటీనటులు: విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి, రవీంద్ర విజయ్, చైతన్య రావు, రాజు సుందరం తదితరులు

ఎడిటింగ్: చాణిక్య రెడ్డి, వెంకట్ ఎన్ స్వామి

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డి కాటసాని

సంగీతం: విద్యాసాగర్ నాగవల్లి

నిర్మాత: రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

కథ:

ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని కొండల్లో గంజాయి పెంపకం జరుగుతూ ఉంటుంది. వాటిని కుందల బ్రదర్స్ అయిన కుందల నాయుడు (చైతన్య రావు), కాస్టాలా నాయుడు (రవీంద్ర విజయ్) డామినేట్ చేస్తూ ఉంటారు. వాళ్ల చేతిలోనే ప్రభుత్వం కూడా ఉంటుంది. అదే కొండప్రాంతాల్లో ఘాటి పని చేసుకుంటూ ఉంటారు శీలావతి (అనుష్క), దేశి రాజు (వెంకట్ ప్రభు). అయితే ఒకసారి కుందల బ్రదర్స్ కు వ్యతిరేకంగా బిజినెస్ మొదలు పెడతారు ఘాటీలు. వీళ్ళందర్నీ పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ (జగపతిబాబు) ఒకరు ఉంటారు. వీళ్ళందరి మధ్య జరిగే బిజినెస్ పోరాటమే ఘాటీ సినిమా కథ..

కథనం:

మామూలుగా క్రిష్ సినిమాలలో కథ పాతగానే ఉన్న కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ ఘాటి సినిమాలో ఈ రెండు పెద్దగా కనిపించలేదు. పుష్పలో ఎర్రచందనం దుంగల దగ్గరే ఆగిపోయాడు సుకుమార్.. ఘాటిలో ఏకంగా గంజాయి వనమే సృష్టించారు క్రిష్, అనుష్క.. క్రిష్ తీసుకున్న లైన్ బాగుంది.. కానీ స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు.. ఫస్టాఫ్ చాలా వరకు నెమ్మదిగా వెళ్ళింది.. సెకండ్ హాఫ్ వేగం పెంచిన అప్పటికే కథలో వేగం తగ్గిపోయింది.. మామూలుగా క్రిష్ సినిమాలలో తెలియని మ్యాజిక్ ఒకటి ఉంటుంది. కొండ పొలం మినహా మిగిలిన అన్ని సినిమాలలో అది కనిపిస్తుంది.. ఘాటిలో ఆ మ్యాజిక్ మిస్ అయిందేమో అనిపించింది. ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవడానికి సినిమాలో పెద్దగా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ లో అనుష్క యాక్షన్ మోడ్ మొదలైన తర్వాత..అక్కడక్కడ కొన్ని సీక్వెన్స్ లు అదిరిపోయాయి.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది.. చేసే తప్పులన్నీ చేసి.. చివరికి ఇది తప్పు అని చెప్పినట్టు ఉంటుంది ఈ సినిమా.. చాలావరకు అనవసరపు సన్నివేశాలు ఉన్నట్టు అనిపించింది.. దానికి తోడు సాగదీసిన స్క్రీన్ ప్లే కూడా ఘాటి మీద ఎఫెక్ట్ బాగానే చూపించింది.

నటీనటులు:

అనుష్క నో డౌట్ అదరగొట్టింది.. ఆమె యాక్షన్ సీన్స్ కు థియేటర్ రీ సౌండ్ వచ్చింది. విక్రమ్ ప్రభు బాగా చేశాడు.. ఆయన ఉన్నంతసేపు అనుష్క లీడ్ తీసుకోలేదు. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. జగపతిబాబు క్యారెక్టర్ కు ఫినిషింగ్ కరెక్ట్ గా ఇవ్వలేదు క్రిష్. రవీంద్ర విజయ్ విలన్ గా ఆకట్టుకున్నాడు. మరో విలన్ గా అత్యంత క్రూరంగా కనిపించాడు చైతన్య రావు. ఈ సినిమా కచ్చితంగా ఆయనకు బాగా హెల్ప్ అవుతుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

విద్యాసాగర్ అందించిన సంగీతం బాగుంది. పాటలు కూడా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే కుదిరింది. ఎడిటింగ్ మాత్రం చాలా వీక్. ఫస్టాఫ్ చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్ళింది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కొండ ప్రాంతాలను చాలా బాగా చూపించారు. దర్శకుడు క్రిష్ లైన్ బాగానే తీసుకున్న స్క్రీన్ ప్లే విషయంలో బాగా తెరపడ్డాడు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ఘాటి.. గంజాయి మత్తు ఎక్కువ.. కానీ కథలో కిక్ తక్కువ..!