Pranitha: ఇద్దరి భామల నోట ఒకే మాట.. వైరల్ అవుతోన్న హీరోయిన్ల ఇన్‌స్టా పోస్ట్..
Pranitha: సినీ పరిశ్రమలో కష్టాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే కష్టం లేని పనంటూ ఏది ఉండదు ఇది ఎవరూ కాదనలేని నిజం. ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ఎంచుకున్న రంగంలో రాణించాలనే లక్ష్యంతోనే ప్రతీ వ్యక్తి పని చేస్తుంటారు. తమ లక్ష్య సాధన కోసం కృషి చేస్తుంటారు...

Pranitha: సినీ పరిశ్రమలో కష్టాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే కష్టం లేని పనంటూ ఏది ఉండదు ఇది ఎవరూ కాదనలేని నిజం. ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ఎంచుకున్న రంగంలో రాణించాలనే లక్ష్యంతోనే ప్రతీ వ్యక్తి పని చేస్తుంటారు. తమ లక్ష్య సాధన కోసం కృషి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమలో తాము ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాలను ఏకరవు పెడుతూ నటి మెహరీన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అందాల భామ ప్రణీత కూడా ఇదే పోస్ట్‌ను రీపోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ మెహరీన్, ప్రణీత చెప్పిన ఆ సినిమా కష్టాలేంటంటే.. ‘సినిమా ప్రపంచంలో విజయాలు దక్కుతాయి. అంతలోనే అపజయాలు ఎదురవుతాయి. అప్పటికప్పుడు జాతకాలు మారిపోతుంటాయి. సినిమా చిత్రీకరణల కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. పరిస్థితులు ఏవైనా షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది. భోజనం, నిద్ర సమయానికి ఉండదు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రేమించే కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది చాలా బాధిస్తుంటుంది. అయితే ఇవన్నీ సినిమా అనే కళ కోసమే’ అంటూ రాసుకొచ్చారు ఈ ఇద్దరు భామలు. ఇలా ఇద్దరు ఒకే పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.


Railway Jobs 2022: నెలకు రూ.1,03,228ల జీతంతో కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..
Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!




