AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virataparvam: రానా సినిమా ఇప్పట్లో రానట్టేనా..? వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సినిమా..

దగ్గుబాటి హీరో రానా అటు హీరోగా మరో వైపు విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు సెకండ్ హీరోగా కూడా కనిపించి ఆకట్టుకుంటున్నాడు.

Virataparvam: రానా సినిమా ఇప్పట్లో రానట్టేనా..? వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సినిమా..
Virataparvam
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2022 | 7:02 AM

Share

Virataparvam: దగ్గుబాటి హీరో రానా(Rana Daggubati)అటు హీరోగా మరో వైపు విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్నాడు. అప్పుడప్పుడు సెకండ్ హీరోగా కూడా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హీరోగా రాణిస్తున్న రానా బాలీవుడ్ సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు. ఇక జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాలో భల్లాలదేవగా నటించి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. బాహుబలి సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు రానా. ఈ కుర్ర హీరో మొదటి నుంచి వైవిధ్యమైన పాత్రలే చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అరణ్య అనే సినిమా చేశారు. ఏనుగుల సంరక్షణ నేపథ్యంలో సాగే ఈ కథలో రానా అద్భుతంగా నటించారు. ఇక ఈ మధ్య పవర్ స్టార్‌తో కలిసి భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రానా. ఈ సినిమాలో రానా నటనకు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.

డ్యానియల్ శేఖర్ గా రానా అదరగొట్టాడనే చెప్పాలి. పవర్ స్టార్‌తో పోటాపోటీగా నటించి శబాష్ అనిపించుకున్నాడు. అయితే రానా కమిట్ అయినా సినిమాల్లో విరాటపర్వం సినిమా ఒకటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా. రానా నక్సలైట్ గా కనిపించనున్న ఈ మూవీలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. కరోనా కారణంగా చాలా రోజులు వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్. బాలీవుడ్ నటులు నందితా దాస్ జరీనా వాహెబ్ ప్రియమణి నవీన్ చంద్ర సాయి చంద్ నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. దృశ్యం 2 నారప్ప చిత్రాలని ఓటీటీలో విడుదల చేసిన సురేష్ బాబు ఈ మూవీని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో `విరాటపర్వం` రిలీజ్ కు థియేటర్స్ దొరకకపోవచ్చు.. దాంతో కనీసం 4 నెలల సమయమైనా పట్టేలా కనిపిస్తోంది. దాంతో ఈ మూవీ ఓటీటీ పక్క అంటున్నారు కొందరు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Shabaash Mithu: సచిన్, ధోని తర్వాత మరో లెజండరీ క్రికెటర్‌ బయోపిక్.. టీజర్‌ దుమ్మురేపుతోంది..!

Viral Photo: క్యూట్ బుజ్జాయి.. చిలిపి చిన్నారి.. ఈ ఫోటోలోని పాప ఇప్పుడు కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్.! ఎవరో గుర్తుపట్టారా!

Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
ఆరోగ్యంగా ఉండాలనే ఈ పిచ్చి అలసటను పెంచుతుందా?
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి