AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీతో కొరటాల.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!

వరుస విజయాలతో అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ సంపాదించుకున్న కొరటాల శివ, ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు

బన్నీతో కొరటాల.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2020 | 6:43 AM

Share

వరుస విజయాలతో అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ సంపాదించుకున్న కొరటాల శివ, ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. జూన్ నుంచి సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ‘ఆచార్య’ తరువాత కొరటాల, బన్నీతో సినిమా తీయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది.

టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. బన్నీతో సినిమా చేయాలని అల్లు అరవింద్, కొరటాలను కోరారట. అందుకోసం ఆయన రూ.13కోట్ల భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్ చేశారట. ఇక మరోవైపు బన్నీతో సినిమాను తీయాలనుకుంటున్న కొరటాల, బన్నీకి ఇప్పటికే కథను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి కాంబోలో ఓ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో ఫిక్స్‌ అయినట్లే. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప’ కోసం సిద్దమవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బన్నీ-సుకుమార్‌ క్రేజీ కాంబోలో మూడో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో కొత్త రికార్డు..!

'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్