దిల్ రాజు రిక్వెస్ట్.. ఓకే చెప్పిన పవన్ కల్యాణ్..!

కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. ఇక మూవీ చిత్రీకరణలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో..

  • Updated On - 7:35 am, Mon, 25 May 20 Edited By:
దిల్ రాజు రిక్వెస్ట్.. ఓకే చెప్పిన పవన్ కల్యాణ్..!

కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడ్డ విషయం తెలిసిందే. ఇక మూవీ చిత్రీకరణలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో.. అందరూ షూటింగ్‌లకు రెడీ అవుతున్నారు. కాగా పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్(బాలీవుడ్ పింక్ రీమేక్‌)లో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి కేవలం 30 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న దిల్ రాజు , పవన్‌కు రిక్వెస్ట్ చేశారట.

మిగిలిన సినిమా షూటింగ్‌కి డేట్లు ఇవ్వాలని పవన్‌ని కోరారట. దానికి వెంటనే స్పందించిన పవన్‌ తన డేట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జూన్‌ మధ్యలో నుంచి వకీల్ సాబ్‌ షూటింగ్‌ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు టాక్‌. కాగా ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత పవన్‌ రీ ఎంట్రీ ఇస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read This Story Also: బన్నీతో కొరటాల.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!