కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో కొత్త రికార్డు..!

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు క్రియేట్ చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు 3 లక్షలు దాటినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు.

కరోనా పరీక్షలు.. ఏపీ ఖాతాలో కొత్త రికార్డు..!
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 6:16 AM

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డు క్రియేట్ చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు 3 లక్షలు దాటినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఏపీలో 3,04,326 పరీక్షలు జరిగాయని ఆయన వివరించారు. ప్రతి 10 లక్షల జనాభాకు 5,699 పరీక్షల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు.

కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,627కు చేరింది. అలాగే 24 గంటల్లో 26 మంది కోలుకోగా, డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,807కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 764 మాత్రమే యాక్టివ్ కేసులు ఉండగా., 56 మంది మరణించారు.

Read This Story Also: చదువు ఫస్ట్.. ‘సైక్లింగ్ ఫెడరేషన్‌’ ఆఫర్‌పై స్పందించిన జ్యోతి..!