AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sruthi: ఏడాది క్రితమే ప్రేమ వివాహం.. గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ నటి భర్త.. పాపం..

ఇటీవలి కాలంలో గుండె జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఆఖరికి మంచి ఫిట్‌నెస్ ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా తమిళ బుల్లితెర నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం. దీనికి తోడు వీరి వివాహం..

Actress Sruthi: ఏడాది క్రితమే ప్రేమ వివాహం.. గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ నటి భర్త.. పాపం..
Actress Shruti Shanmugapriya
Basha Shek
|

Updated on: Aug 04, 2023 | 8:13 PM

Share

ఇటీవలి కాలంలో గుండె జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఆఖరికి మంచి ఫిట్‌నెస్ ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా తమిళ బుల్లితెర నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం. దీనికి తోడు వీరి వివాహం గత ఏడాది మేనెలలోనే జరిగింది. పెళ్లై అలా ఏడాది గడిచిందో లేదో గుండెపోటుతో అరవింద్‌ కన్నుమూయడం శ్రుతి జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. అరవింద్ మృతి  కోలీవుడ్‌లో పలువురిని కలచివేసింది. ఈ షాక్ నుంచి శృతి, అరవింద్ కుటుంబం త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. శృతి, అరవింద్ కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. గతేడాది మేలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. శృతి థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ‘వాణి రాణి, కళ్యాణ పరిసు, పొన్నుంచల్, భారతి కన్నమ్మ వంటి పలు సీరియల్స్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక శృతి షణ్ముగ భర్త అరవింద్ మంచి బాడీ బిల్డర్. శరీర బరువు తగ్గించుకోవడానికి శిక్షణ కూడా తీసుకున్నాడు. అతను 2022లో ‘మిస్టర్ తమిళనాడు’గా కూడా గుర్తింపు పొందాడు. ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టి పెడతాడు. అలాంటి అరవింద్‌కు బుధవారం ( ఆగస్టు 2వ తేదీ) సాయంత్రం హఠాత్తుగా గుండె పోటు బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. జీవితాంతం కష్టసుఖాలు పంచుకోవాలన్న భర్త హఠాత్తుగా కన్నుమూయడంతో శ్రుతి ఆవేదనకు అంతులేకుండా పోయింది. కాగా అరవింద్, శృతికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతను తన అభిమానుల కోసం వీడియోలను ఫోటోలను తరచూ పంచుకునేవాడు. అయితే అరవింద్ మరణవార్తతో ఇప్పుడు అతని అభిమానులు, ఫాలోవర్స్‌ విషాదంలో మునిగిపోయారు. . అరవింద్ కి సద్గతులు ప్రాప్తించాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు .అలాగే శ్రుతికి కొండంత ధైర్యం ప్రసాదించాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..