- Telugu News Photo Gallery Cinema photos Niharika Konidela Shares Interesting post about Life telugu cinema news
Niharika Konidela: జీవితంలో అలా జరగాలని కోరుకుంటే ఒత్తిడి పెరుగుతుంది.. నిహారిక పోస్ట్ వైరల్..
మెగా డాటర్ నిహారిక.. కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యాక్టింగ్ మాత్రమే కాకుండా.. యాంకరింగ్ లోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఈ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్నారు.
Updated on: Aug 04, 2023 | 8:15 PM

మెగా డాటర్ నిహారిక.. కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యాక్టింగ్ మాత్రమే కాకుండా.. యాంకరింగ్ లోనూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవలే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఈ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్నారు.

చాలా రోజులుగా నటనకు దూరంగా ఉన్న నిహారిక.. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్ లో నటించి అలరించారు. కొద్దిరోజుల క్రితం తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంటున్నట్లు జూలై 4న అనౌన్స్ చేసింది.

ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరింది. అయినప్పటికీ నిహారికపై నెగిటివి మాత్రం తగ్గలేదు. అయితే అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది నిహారిక. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

నిహారిక పోస్ట్.. జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. అలా కాకుండా ఒకేచోట ఆగిపోవాలని మనం కోరుకుంటే వాటి సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జీవితం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్లండి.

ఈ జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక మనం సర్ ప్రైజ్ అవుతాము అంటూ ఓ కోట్ షేర్ చేసింది నిహారిక.. అలాగే కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.




