మద్యం మత్తులో కారు నడిపిన డైరెక్టర్.. ఒకరి మరణం.. చివరకు..
సినీ దర్శకుడు సిద్ధాంత్ దాస్ మద్యం సేవించి వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత దర్శకుడిని పట్టుకున్న స్థానికులు అతడిపై దాడి చేశారు. పోలీసులు సిద్ధాంత్‌ను అరెస్టు చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రద్దీగా ఉండే ఠాకూర్ పుకూర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. డైరెక్టర్ సిద్ధాంత్ దాస్ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగనప్పుడు ప్రముఖ బెంగాలీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కూడా అతనితో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత, స్థానికులు ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ది చేశారు. సిద్ధాంత్ దాస్ అలియాస్ విక్టోను ఠాకూర్‌పుకూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు సిద్ధాంత్ కారు నడుపుతున్నాడు.
బెంగాలీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రియ బసు ఆయనతో పాటు కారులో ఉన్నారు. స్థానికుల దాడి నుంచి శ్రియను కాపాడిన పోలీసులు ఆమెను కుటుంబానికి అప్పగించారు. ‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం, వారి సిరీస్ విజయాన్ని జరుపుకోవడానికి శనివారం రాత్రి కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్‌లో అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో చాలా మంది మద్యం సేవించారు. అందరూ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లిపోయారు.
అదే సమయంలో, సిద్ధాంత్ దాస్, శ్రియ బసు కారులో నగరం చుట్టూ తిరగడం ప్రారంభించారు. ఆదివారం ఉదయం వారి కారు ఆకస్మాత్తుగా ఠాకూర్ బజార్ లోకి ఓవర్ స్పీడ్ తో వచ్చింది. ఈప్రమాదంలో ఒకరు మరణించగా.. ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం కస్తూరి నర్సింగ్ హోమ్, CMRI ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధాంత్ మద్యం మత్తులో ఉన్నాడని స్పష్టమైంది.
ఇవి కూడా చదవండి :
