Tollywood: పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో పెళ్లి.. ఈ బ్యూటీ ఎవరంటే..
17 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకుంది. కానీ వివాహానికి ముందే తల్లైంది. 47 సంవత్సరాల వయసులో మరోసారి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది.
సాధారణంగా సినీతారల పర్సనల్ విషయాలు ఎక్కువగా ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంటాయి. వెండితెరపై అందం, అభినయంతో కట్టిపడేసే తారల జీవితాల్లో ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అనేక కష్టాలను, విమర్శలను, అవమానాలను ఎదుర్కొని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని నటీనటులుగా కొనసాగుతుంటారు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. కేవలం తెరపై పాత్రలతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తలలో నిలిచింది. 17 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. కానీ అంతకు ముందే తల్లి అయ్యిందనే ప్రచారం నడిచింది. ఇప్పుడు 47 ఏళ్ల వయసులోనే మరోసారి పెళ్లి చేసుకుదంి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..తనే నటి మహి గిల్.
మహి గిల్ ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె బోల్డ్, డిఫరెంట్ హెయిర్కట్స్లో తన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. దేవ్ డి సినిమా ద్వారా మహికి నిజమైన గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే మహి కూడా పాజిటివ్, నెగిటివ్, బోల్డ్ రోల్స్ చేసింది. ఆమె పోసింబా బెవ్ సిరీస్ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే మహి తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మహి 17 ఏళ్ల వయసులో తొలిసారి పెళ్లి చేసుకుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మహి మాట్లాడుతూ.. పెళ్లికి ముందే తాను ఒక కుమార్తెకు జన్మనిచ్చినట్లు తెలిపింది.
ఆమె పేరు వెరోనికా, ఆమె వయస్సు 5 సంవత్సరాలు. మహి 17 ఏళ్ల వయసులో తొలిసారి పెళ్లి చేసుకుంది. అయితే ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్తను ప్రేమించింది. ఇప్పుడు మహి వయసు 47 సంవత్సరాలు. ఈ క్రమంలో తన ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది మహి. 2019 లో, మహి గిల్ రవికేసర్తో కనిపించారు. ఆ సమయంలో ఇద్దరూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్నారు. అంతలోనే 2023లో మహి, రవికేసర్ మధ్య ప్రేమాయణం అంటూ టాక్ నడిచింది. మహి గిల్ 2003లో అమితోజ్ మాన్ దర్శకత్వం వహించిన ‘హవైన్’ చిత్రంతో తొలిసారిగా నటించింది. మహి గిల్ తదుపరి మహేష్ మంజ్రేకర్ 1962: ది వార్ ఇన్ ది హిల్స్‌లో అభయ్ డియోల్, సుమీత్ వ్యాస్, ఆకాష్ తోసర్ సరసన నటించనున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.