AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే టీమిండియాలో ఊహించని మార్పులు.. కోహ్లీ, రోహిత్ శకం క్లోజ్?

Team India: జనవరి 22 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో 5 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ వెళ్లనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే టీమిండియాలో ఊహించని మార్పులు.. కోహ్లీ, రోహిత్ శకం క్లోజ్?
Ind Vs Eng Ct 2025
Venkata Chari
|

Updated on: Jan 08, 2025 | 7:42 AM

Share

India vs England: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో 8 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో 5 టీ20ఐలు, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 సిరీస్ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు పూర్తిగా విశ్రాంతి ఇవ్వనున్నారు.
  • ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.
  • వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడనున్నారు.
  • వన్డే సిరీస్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ కూడా జట్టులో చేరనున్నాడు.
  • ఫిట్‌నెస్ టెస్టు తర్వాత మహమ్మద్ షమీ వన్డే జట్టుకు ఎంపిక కానున్నాడు.
  • ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కనిపించనున్నారు.
  • భారత వన్డే జట్టులో అదనపు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఎంపిక కానున్నాడు.
  • లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను వన్డే జట్టులోకి తీసుకోవాలా వద్దా అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చర్చించింది.
  • ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కనిపించనున్న చాలా మంది ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది.
  • జనవరి 12న ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో సిరీస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్, ఇంగ్లండ్ మధ్య జనవరి 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా, ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

1వ టీ20ఐ: జనవరి 22 (చెన్నై)

ఇవి కూడా చదవండి

2వ టీ20ఐ: జనవరి 25 (కోల్‌కతా)

3వ టీ20ఐ: జనవరి 28 (రాజ్‌కోట్)

4వ టీ20ఐ: జనవరి 31 (పుణె)

5వ టీ20ఐ: ఫిబ్రవరి 2 (ముంబై)

1వ వన్డే: ఫిబ్రవరి 6 (నాగ్‌పూర్)

2వ వన్డే: ఫిబ్రవరి 9 (కటక్)

3వ వన్డే: ఫిబ్రవరి 12 (అహ్మదాబాద్)

ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. దీని ప్రకారం టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నీకి సంబంధించి భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఎలా ఉందో ఓసారి చూద్దాం..

భారత్ vs బంగ్లాదేశ్: ఫిబ్రవరి 20 (దుబాయ్)

భారత్ vs పాకిస్థాన్: ఫిబ్రవరి 23 (దుబాయ్)

భారత్ vs న్యూజిలాండ్: మార్చి 2 (దుబాయ్)

సెమీ-ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 4 (దుబాయ్)

ఫైనల్ (అర్హత సాధిస్తే): మార్చి 9 (దుబాయ్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!