AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..

ఈ నేపథ్యంలోనే తాజాగా కీర్తి సురేష్‌ నటిస్తోన్న కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు. భోళా శంకర్ చిత్రం తర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా పేరు 'ఉప్పు కప్పురంబు'. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా కథాంశం వెరైటీగా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మేకర్స్‌ ఈ సినిమాను...

Keerthy Suresh: కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
Keerthy Suresh
Narender Vaitla
|

Updated on: Jul 28, 2024 | 6:56 AM

Share

కరోనా సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో మేకర్స్‌ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. అయితే ఆ తర్వాత కరోనా తగ్గిపోవడం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. నెలరోజుల్లోపు ఓటీటీలోకి వచ్చినా తొలుత మాత్రం కచ్చితంగా థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయి. అయితే తాజాగా మళ్లీ నేరుగా ఓటీటీలో విడదల చేయడానికి సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌.

ఈ నేపథ్యంలోనే తాజాగా కీర్తి సురేష్‌ నటిస్తోన్న కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు. భోళా శంకర్ చిత్రం తర్వాత తెలుగు తెరకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఈ సినిమా పేరు ‘ఉప్పు కప్పురంబు’. టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా కథాంశం వెరైటీగా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే మేకర్స్‌ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో కీర్తి సురేష్‌ పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

కాగా ఈ సినిమాలో సుహాస్‌ కూడా మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. నిన్నిలా నిన్నిలా మూవీతో దర్శకుడిగా మారిన అనిల్‌ శశి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే మేకర్స ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ నుంచి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే తెలుగులో సినిమాలు తగ్గించిన కీర్తి సురేష్‌.. తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మొత్తం 3 సినిమాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది కీర్తి సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న బేబీ జాన్‌తో హిందీ ఇండ‌స్ట్రీకి పరిచయం కానుంది. దీంతో పాటు హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌లోనూ కీర్త నటించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..