Keerthi Suresh: మహా నటికి కూడా ఆ మాటలు తప్పలేవన్నమాట.. ఆసక్తికర విషయాలు తెలిపిన కీర్తి సురేష్..
Keerthi Suresh: సినిమా జీవితం ఎంతటి రంగుల ప్రపంచమో అంతే చీకటి కోణాలు కూడా ఉంటాయి. విజయం దక్కిందా.. దానిని సొంతం చేసుకోవడానికి అందరూ ముందుంటారు కానీ అపజయం ఎదురైతే మాత్రం కొందరిపైనే నెట్టేయడానికి సిద్ధమవుతారు. మరీ ముఖ్యంగా...
Keerthi Suresh: సినిమా జీవితం ఎంతటి రంగుల ప్రపంచమో అంతే చీకటి కోణాలు కూడా ఉంటాయి. విజయం దక్కిందా.. దానిని సొంతం చేసుకోవడానికి అందరూ ముందుంటారు కానీ అపజయం ఎదురైతే మాత్రం కొందరిపైనే నెట్టేయడానికి సిద్ధమవుతారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక హీరోయిన్ నటించే సినిమాలు వరుసగా వైఫల్యం చెందితే చాలు, ఆ హీరోయిన్‌పై ఐరెన్ లెగ్ ముద్ర వేస్తుంటారు. చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇలాంటి వార్తలు వినే ఉంటాం.
అయితే తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని చెబుతోంది నటి కీర్తి సురేష్. మహా నటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకొని దేశం దృష్టిని ఆకర్షించిన కీర్తిని కూడా ఐరెన్ లెగ్ అంటూ హేలన చేశారని చెప్పుకొచ్చింది. కీర్తి సరేష్ నటించిన తాజాగా చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న అవమానం గురించి మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా మలయాళ సినిమాతో నా కెరీర్‌ను మొదలుపెట్టాను. అయితే నా ఫస్ట్ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన కొద్ది రోజులకే ఆగిపోయింది. తర్వాత మరో రెండు సినిమాలు ఇలాగే ఆగిపోయాయి.
దీంతో నాపై ఐరన్ లెగ్ ముద్రవేశారు. ఈమె నటిస్తే సినిమా ఆగిపోతుందని ప్రచారం చేశారు. ఆ సమయంలో బాధ అనిపించింది. అయితే వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేస్తూ ముందుకెళ్లాను. నేను చేసిన పనే నాకు విజయాలను అందించింది. దీంతో నాపై జరిగిన ప్రచారమంతా ఒక్కసారిగా తొలిగి పోయింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్.
Also Read: RBI Restrictions: ఆ బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం.. ఖాతాదారులు రూ.1 లక్ష కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు
MS Dhoni: ఎంఎస్ ధోనీని చూసి చాలా నేర్చుకున్నా.. అతను ప్రశాంతంగా జట్టును నడిపిస్తాడు..