AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపికా పదుకోన్‌ను గుర్తు చేస్తున్న తెలుగమ్మాయి! ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా..

బాలీవుడ్‌లో 'బాజీరావ్ మస్తానీ' సినిమాలో మస్తానీ పాత్రలో దీపికా పదుకోన్ అభిమానుల మనసు దోచేసింది. ఆ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్, రాజస్ ఔట్‌ఫిట్స్, ఎమోషనల్ డెప్త్.. అన్నీ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఫ్రెష్‌గా ఉన్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక బ్యూటీ ఆ మస్తానీ వైబ్‌ను రీక్రియేట్ ..

దీపికా పదుకోన్‌ను గుర్తు చేస్తున్న తెలుగమ్మాయి! ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా..
Deepika N Child Artist
Nikhil
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 2:01 PM

Share

బాలీవుడ్‌లో ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలో మస్తానీ పాత్రలో దీపికా పదుకోన్ అభిమానుల మనసు దోచేసింది. ఆ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్, రాజస్ ఔట్‌ఫిట్స్, ఎమోషనల్ డెప్త్.. అన్నీ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో ఫ్రెష్‌గా ఉన్నాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక బ్యూటీ ఆ మస్తానీ వైబ్‌ను రీక్రియేట్ చేసి అందరినీ మతి చెడగొట్టింది! కేవలం లుక్‌తో మాత్రమే కాదు, తనదైన హైదరాబాద్ టచ్‌తో మిక్స్ చేసి మరింత మ్యాజికల్‌గా మార్చింది. ఎవరు ఈ మస్తానీ లైక్ బ్యూటీ?

టాలీవుడ్‌లో చైల్డ్​ ఆర్టిస్ట్​గా ఎంట్రీ ఇచ్చి ‘బలగం’ సినిమాతో హీరోయిన్​గా నిరూపించుకున్న బ్యూటీ కావ్య కల్యాణ్​రామ్​. కథలను జాగ్రత్తగా ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ ఫోటోల్లో ఆమె మస్తానీ లాంటి డివైన్​ లుక్‌లో కనిపించింది. గోల్డెన్ టోన్స్, హెవీ జ్వెలరీ, ఫ్లోయింగ్ లెహంగా లాంటి ఔట్‌ఫిట్‌తో రాజసం ఉట్టిపడేలా మెరిసిపోయింది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దీపికా లుక్‌ను కాపీ చేయకుండా, హైదరాబాద్ స్టైల్‌లో అలంకరించుకుంది కావ్య! హైదరాబాదీ పరండా, ముగ్గు డిజైన్స్, స్వారోవ్స్కీ లైక్ బైండీస్​ టచ్‌లతో మస్తానీని మరింత మోడర్న్, దేశీ ఫ్యాషన్​గా మార్చేసింది. మేకప్‌లో స్మోకీ ఐస్, రెడ్ లిప్స్, హైలైటెడ్ చీక్‌బోన్స్.. అన్నీ కావ్యను రియల్ మస్తానీలా మార్చాయి. సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్​తో అదరగొట్టే కావ్య లుక్స్​ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.

Kalyanram

Kalyanram

తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా హాట్​ లుక్స్​తో అందరినీ ఆకట్టుకుంటోంది. మస్తానీ లుక్‌లో కూడా గ్రేస్, పవర్ మిక్స్ అయి డివైన్​ లుక్​తో మెరిసిపోయింది. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్స్ ‘మస్తానీ రీబోర్న్ ఇన్ హైదరాబాద్!’,‘కావ్యా, నువ్వే నెక్స్ట్ దీపికా!’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు కావ్య నెక్ట్ ప్రాజెక్ట్​ లుక్​ అంటూ సంబరపడిపోతున్నారు. ఏదేమైనా ట్రెడిషన్​, ఫ్యాషన్​ కలగలసిన ఈ ఔట్​ఫిట్​లో కావ్య నిజంగానే ఎలిగెంట్​ లుక్​తో ఆకట్టుకుంటోంది!

Follow Us