Pushpa: సామ్ స్పెషల్ సాంగ్‌కు బాలీవుడ్ పెళ్లికూతురు డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
ఐకాన్‌స్టా్‌ర్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రేజీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప (Pushpa). రష్మిక మందాన శ్రీవల్లి పాత్రలో మెప్పించగా సమంత (Samantha) స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రేజీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప (Pushpa). రష్మిక మందాన శ్రీవల్లి పాత్రలో మెప్పించగా సమంత (Samantha) స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. కాగా ఈ సినిమాలో ‘ఉ అంటావా మావా.. ఉఊ అంటావా’ అంటూ సామ్ వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి కరిష్మా తన్నా కూడా ఈ పాటకు కాలు కదిపింది. తన వెడ్డింగ్ రిసెప్షన్‌లో హుషారైన స్టెప్పులు వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా బుల్లితెర నటిగా కెరీర్ ఆరంభించిన కరిష్మా తన్నా ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. ‘దోస్తీ’, ‘గ్రాండ్ మస్తీ’, ‘సంజు’ తదితర హిట్ చిత్రాల్లో మెప్పించింది. అంతకుముందు ప్రముఖ టీవీ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడీ-10 సీజన్ విజేతగా నిలిచింది. కాగా ఈ అమ్మడు తాజాగా వ్యాపారవేత్త వరుణ్ బంగేరాతో కలిసి ఏడడుగులు నడిచింది. ముంబయిలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబాలు, ప్రముఖ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌లో ‘ఉ అంటావా మావా’ హిందీ వెర్షన్‌కు సరదాగా స్టెప్పులేసింది కరిష్మా. కాగా ఈ కొత్త పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది.
View this post on Instagram
View this post on Instagram
Also Read:Hyderabad: బంజారాహిల్స్‌లో యూట్యూబర్ సరయు అరెస్ట్.. మహిళలని కించపరిచే షాట్ ఫిల్మ్ తీసినందుకు..?
Ananya Panday: నాకు రిలేషన్ షిప్ కంటే ఫ్రెండ్ షిప్పే ముఖ్యం.. లైగర్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు..




