Work From Home: ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించిన ఇ-కామర్స్‌ సంస్థ.. శాశ్వతంగా నచ్చిన చోటు నుంచి పనిచేసుకునే..

Work From Home: కరోనా మహమ్మారి వర్క్‌ కల్చర్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అందుబాటులో లేని సంస్థలు కూడా ఈ విధానాన్ని అవలంభించాల్సిన పరిస్థితి వచ్చింది. పలు సంస్థలు కరోనా కేసులు...

Work From Home: ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించిన ఇ-కామర్స్‌ సంస్థ.. శాశ్వతంగా నచ్చిన చోటు నుంచి పనిచేసుకునే..
Follow us

|

Updated on: Feb 08, 2022 | 9:49 AM

Work From Home: కరోనా  (Corona) మహమ్మారి వర్క్‌ కల్చర్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అందుబాటులో లేని సంస్థలు కూడా ఈ విధానాన్ని అవలంభించాల్సిన పరిస్థితి వచ్చింది. పలు సంస్థలు కరోనా కేసులు పెరుగుతోన్న వేళ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కలిపిస్తే మరికొన్ని మాత్రం కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కలిపించాయి. ఇలా ఏకంగా రెండేళ్లుగా వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్నే అవలంభిస్తున్నాయి. ఈ తరుణంలోనే కొన్ని కంపెనీలు విప్లవాత్మక మార్పులు చేశాయి. ఏకంగా శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని తీసుకొచ్చాయి.

తాజాగా ఇలాంటి కీలక నిర్ణయమే తీసుకుంది ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ మీషో (Meesho). చిన్న సంస్థగా మొదలైన మీషో ఇప్పుడు భారీగా ఆదాయాలను ఆర్జిస్తోంది. సాఫ్ట్‌బ్యాంక్‌, ఫేస్‌బుక్‌ వంటి బడా సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టారంటేనే ఈ సంస్థ క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సంస్థ తమ ఉద్యోగులకు ఒక బంపరాఫర్‌ ప్రకటించింది. ఉద్యోగులు శాశ్వతంగా తమకు నచ్చిన చోటు నుంచి పనిచేసుకునే అవకాశం కలిపించింది. ఆఫీసుకు వచ్చి గానీ, ఇంటి నుంచి గానీ, నచ్చిన చోటు నుంచి పనిచేసే వెసులుబాటును కలిపించింది. ప్రస్తుతం మీషోలో మొత్తం 1700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారందరికీ ఈ సదుపాయాన్ని అందించనున్నారు.

Meesho

అంతేకాకుండా బెంగళూరులో ఉన్న మీషో ప్రధాన ఆఫీసుకి అధికారిక ప్రయాణాల కోసం వచ్చే ఉద్యోగుల ఆరేళ్లలోపు పిల్లల కోసం డేకేర్‌ సదుపాయం కూడా కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయమై సంస్థ సీనియర్‌ హెచ్‌ఆర్‌ ఆశిస్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌ పని విధానాలకు సంబంధించి అనేక నమూనాలు అధ్యయనం చేశాం. మీషోతో అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయి’ అని చెప్పుకొచ్చారు.

Also Read: IPL 2022 Auction: ఆ 6గురి ప్లేయర్స్‌పై కన్నేసిన ఆర్‌సీబీ.. కోహ్లీ వారసుడి కోసం పెద్ద స్కెచే.!

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య తెగతెంపులు.. సీఎం మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..!

NCD vs Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ కంటే ఎన్‌సీడీల్లో వడ్డీ ఎక్కువ వస్తుందా.. ఎన్‌సీడీల్లో పెట్టుబడి సురక్షితమేనా..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే