West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య తెగతెంపులు.. సీఎం మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..!

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు సోమవారం తీవ్రస్థాయికి చేరుకుంది. నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. పార్టీ అగ్రనాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టేపనిలో పడ్డారు.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య తెగతెంపులు.. సీఎం మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..!
Mamata Banerjee, Prashant Kishor
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 08, 2022 | 8:29 AM

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల(Municipal Elections)కు అభ్యర్థుల జాబితాపై అధికార తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress)లో అంతర్గత పోరు సోమవారం తీవ్రస్థాయికి చేరుకుంది. నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. పార్టీ అగ్రనాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టేపనిలో పడ్డారు. ఇతర చర్యలతోపాటు, పార్టీ సభ్యుల ఫిర్యాదులను పరిశీలించేందుకు సీనియర్ నేతలతో కూడిన అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తృణమూల్ సోమవారం ప్రకటించింది.ఈ సమస్య కారణం టీఎంసీ(TMC), ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) నేతృత్వంలోని పొలిటికల్ కన్సల్టెన్సీ I-PAC మధ్య సంబంధాలలో విభేదాల పుకార్లు తెరపైకి వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు సంబంధించి అభ్యర్థుల జాబితా అసలు వ్యవహారానికి కారణమైంది.

టీఎంసీ సోషల్ మీడియాలో ఒక జాబితా, శుక్రవారం సాయంత్రం TMC సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ, పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి సంతకం చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో వివాదం చెలరేగింది. రెండు జాబితాలు వెలువడిన తర్వాత, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి, అనేక మంది అసంతృప్త కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి టైర్లు తగలబెట్టి నినాదాలు చేశారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తృణమూల్ కాంగ్రెస్, I-PAC, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ పౌర ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో.. ప్రశాంత్ కిషోర్, టీఎంసీ మధ్య కుదిరిన ఒప్పందం చెడిందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా బెంగాల్‌కు దూరంగా ఉండడానికి సిద్ధమవుతున్నాడు. అటు, మమతా బెనర్జీ కూడా ప్రశాంత్ కిషోర్‌తో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకుంది. అయినప్పటికీ మమతా బెనర్జీ దీనికి సంబంధించింది.సొంత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీతో విభేదాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌తో బ్రేకప్ గురించి అడిగినప్పుడు, మమతా బెనర్జీ లక్నో వెళ్లే ముందు విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఈ విషయంలో ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. ఈ విషయంలో ఎలాంటి ప్రశ్న అడగవద్దని అన్నారు.

రాష్ట్రంలోని 108 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం టీఎంసీ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టైర్లు తగులబెట్టి నినాదాలు చేశారు. జాబితా నిరసనలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ సంస్థ I-PAC పై ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. అదే సమయంలో నేరుగా మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ మధ్య వివాదం తెరపైకి వచ్చింది.

I-PACతో తృణమూల్ కాంగ్రెస్ తెగతెంపులు  ఐ-ప్యాక్‌తో తృణమూల్ కాంగ్రెస్ బంధాన్ని తెంచుకునేందుకు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో పౌర ఎన్నికల అభ్యర్థుల జాబితాపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని లేవనెత్తారు. కాగా, టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ విడుదల చేసిన జాబితా కూడా సరైన జాబితానేనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అదే జాబితా ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులకు కాస్త ఇబ్బంది ఉన్నా అది కూడా పరిష్కారమవుతుంది. TMC సోషల్ మీడియాకు ,పార్టీ విడుదల చేసిన జాబితాకు మధ్య వ్యత్యాసం ఉంది. దీంతో కార్యకర్తల్లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ఒక్కసారిగా కార్యకర్తలు రోడ్డెక్కడంతో.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

టీఎంసీతో ప్రశాంత్ కిషోర్ దూరం పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయలో టీఎంసీతో కలిసి పనిచేయడం ఐ-పీఏసీకి ఇష్టం లేదని రెండు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి సందేశం పంపారు. ప్రతిస్పందనగా, మమతా బెనర్జీ, ‘ధన్యవాదాలు’ అని రాశారు. ఆనందబజార్ పత్రిక నివేదించిన ప్రకారం, బెంగాల్‌లోని టిఎంసి నాయకులు, కార్యకర్తలు, ఇతర రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ శాఖలపై ఐ-ప్యాక్ జోక్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కార్యకర్తల నిరసనల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి, సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ, ఇది పార్టీ అంతర్గత విషయం, అన్ని విభేదాలు త్వరలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఉత్తర 24 పరగణాలలోని కమర్హతిలో, ఇండియన్ నేషనల్ తృణమూల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు కొందరు పగటిపూట అనేక ఆటోలు, బస్సులు రాకుండా అడ్డుకున్నారు. అభ్యర్థుల జాబితాపై కార్యకర్తలు నిరసనకు దిగారు.

Read Also… Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్ మంజూరు.. బాబా విడుదలతో హీటెక్కిన పంజాబ్‌ పాలిటిక్స్

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.