Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్ మంజూరు.. బాబా విడుదలతో హీటెక్కిన పంజాబ్‌ పాలిటిక్స్

మరికొద్దిరోజులల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌‌లో ఒక్కసారిగా పాలిటిక్స్‌ మారిపోయాయి. ఓ బాబా పేరు సడెన్‌గా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన టాక్‌ ఆఫ్‌ ది పంజాబ్‌గా మారారు.

Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్ మంజూరు.. బాబా విడుదలతో హీటెక్కిన పంజాబ్‌ పాలిటిక్స్
Dera Baba
Balaraju Goud

|

Feb 08, 2022 | 7:25 AM

Parole to Dera Sacha Sauda Chief Gurmeet Ram Rahim Singh: మరికొద్దిరోజులల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్‌‌(Punjab Assembly Election 2022)లో ఒక్కసారిగా పాలిటిక్స్‌ మారిపోయాయి. ఓ బాబా పేరు సడెన్‌గా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన టాక్‌ ఆఫ్‌ ది పంజాబ్‌గా మారారు. హర్యానా(Haryana)లో సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు(Rape Convict)లో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు.

బాబా ఇంతకు ముందు చాలాసార్లు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రతిసారీ అతని పెరోల్‌ను తిరస్కరించింది కోర్టు. ప్రస్తుతం బాబా రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉన్నారు. శిక్ష పడిన ఖైదీలకు జైలులో సెలవు లభిస్తుంది. నిర్ణీత సమయం వరకు వారి ఇళ్లకు వెళ్లే సెలవుదినం పూర్తి చేసుకుని తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే , పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ పెరోల్ వెనుక రాజకీయ కోణం దాగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో ఐదేళ్లుగా ఊచలు లెక్కబెడుతున్నారు ఓ బాబా. కానీ సడెన్‌గా 21 రోజుల పాటు ఆయనకు పెరోల్ లభించింది. ఇది ఇప్పుడు పంజాబ్‌ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనే డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌. ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు గానీ, డేరా బాబా అంటే తెలియని వారుండరు. యస్‌, డేరా బాబాకు 21 రోజుల పాటు బెయిల్‌ వచ్చింది. శిక్ష ఖరారైన ఖైదీలకు ఇచ్చే ప్రత్యేక సెలవు కింద డేరా బాబాకు ఈ అవకాశం లభించింది. అయితే, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు డేరా బాబా బయటకు రావడం చర్చకు దారితీసింది. పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో డేరా బాబా, ఆయన అనుచరులకు గట్టి పట్టుంది. గతంలో జరిగిన పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారు కీలకంగా మారినట్టు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ముఖ్యంగా చాలా అసెంబ్లీ స్థానాల్లో డేరా బాబా ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, అకాలీదళ్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే గుర్మీత్‌ సింగ్‌ జైలు నుంచి బయటకు రానుండటం చర్చనీయాంశమైంది. అయితే, డేరా బాబా పెరోల్‌కు ఎన్నికలకు సంబంధం లేదని అంటున్నారు అధికారులు. నిబంధనల ప్రకారమే ఆయనకు ఫర్లాఫ్‌ లభించిందని స్పష్టం చేశారు, హర్యానా జైళ్లశాఖ మంత్రి రంజిత్‌ సింగ్‌ చౌతాలా. డేరా బాబా కొందరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు నిరూపితం కావడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు ఆగస్టు 25, 2017న సాధ్వి అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీమ్‌ను పంచకుల కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి సునారియా జైలుకు పంపింది. అయితే, ఈ కేసులో ఆగస్టు 27న రోహ్‌తక్‌లోని సునారియా జైలులో సీబీఐ కోర్టు విచారణ చేపట్టగా, రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీమ్ కూడా దోషిగా తేలింది. ఈ రోజు నుంచి రామ్ రహీమ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

డేరా మద్దతుదారులు లక్షల్లో ఉన్నారు ముఖ్యంగా, పంజాబ్‌లో దాదాపు 300 డేరాలు ఉన్నాయి. వీరిలో దాదాపు 10 మంది డేరాల మద్దతుదారుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇందులో రాధాస్వామి బియాస్, డేరా సచ్చా సౌదా, నిరంకారి, నామ్‌ధారి, దివ్య చ్యోతి జాగృతి సంస్థాన్, డేరా సచ్‌ఖండ్ బల్లన్, డేరా బెగోవాల్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అదే సమయంలో పంజాబ్ ఎన్నికల్లో డేరాస్ మద్దతు లభిస్తే ఆ పార్టీలకు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు దక్కే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ నుండి SAD ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ బాదల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు గతంలో డేరా బియాస్, డేరా సచ్‌ఖండ్ బల్లన్‌లకు నమస్కరించడానికి కారణం ఇదే. అయితే, ఈ నేతలు ఎవరూ ఈసారి ఏ డేరా సచ్చా సౌదాకు వెళ్లలేదు.

Read Also…  Himalayas: హిమాలయాల్లో కరిగిపోతున్న మంచు.. అలా జరిగితే భారీ నష్టం సంభవిస్తుందని నిపుణుల హెచ్చరిక..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu