Ananya Panday: నాకు రిలేషన్ షిప్ కంటే ఫ్రెండ్ షిప్పే ముఖ్యం.. లైగర్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టైలిష్ విలన్ చుంకీపాండే వారసురాలిగా సినిమా పరిశ్రమకు పరిచయమైంది అనన్యా పాండే (Ananya Panday) . స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాలీవుడ్ స్టైలిష్ విలన్ చుంకీపాండే వారసురాలిగా సినిమా పరిశ్రమకు పరిచయమైంది అనన్యా పాండే (Ananya Panday) . స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత పతి పత్నీ ఔర్ వో, ‘కాలీపీలీ’ వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. త్వరలోనే విజయ్ దేవరకొండ ‘లైగర్’ (Liger) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది. కాగా ఆమె నటించిన తాజా చిత్రం ‘గెహ్రాయియా’ (Gehraiyaan) ఈనెల 11న అమెజాన్ ఫ్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది అనన్య. కాగా ఆమె బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల కోసం రాజస్థాన్‌లోని రణతంబోర్‌కు వెళ్లిన వీరు అక్కడి నేషనల్ పార్కులో జంటగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
కాగా ‘గెహ్రాయియా’ ప్రమోషన్‌లో భాగంగా రిలేషన్‌షిప్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అనన్య. పర్‌ఫెక్ట్ రిలేషన్‌షిప్ పై తనకు నమ్మకం లేదని అసలు అది ఎక్కడా ఉండదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు రిలేషన్‌షిప్ కంటే ఫ్రెండ్ షిపే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చింది. ‘రిలేషన్‌షిప్‌లపై నాకున్న అభిప్రాయాలను ‘గెహ్రాయియా’ చిత్రం పూర్తిగా మార్చింది. నాకు తెలిసినంతవరకు పర్‌ఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడా ఉండదు. నావరకు మాత్రం ఫ్రెండ్‌షిపే ప్రధానం. మీకు ఆ పరిస్థితి ఎదురయ్యే వరకు ఎలా స్పందిస్తారనేది మీకు తెలియదు. ఇక ఈ సినిమాలో నాది బాగా ఎమోషనల్ క్యారెక్టర్. భావోద్వేగాలను సరిగ్గా పండించడానికి ఎంతో వర్క్‌షాప్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో డైరెక్టర్ శకున్‌బాత్రా నాకెంతో సహకరించారు ‘ అని అనన్య పాండే వెల్లడించింది. కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గెహ్రాయియా’ లో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
View this post on Instagram