Khiladi: బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ లెవల్లో ఖిలాడి.. నిర్మాత కొనేరు సత్యనారయణ ఆసక్తికర కామెంట్స్..

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ఖిలాడి (Khiladi). క్రాక్ వంటి సూపర్ హిట్ రవితేజ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Khiladi: బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ లెవల్లో ఖిలాడి.. నిర్మాత కొనేరు సత్యనారయణ ఆసక్తికర కామెంట్స్..
Khiladi
Follow us

|

Updated on: Feb 08, 2022 | 10:33 AM

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ఖిలాడి (Khiladi). క్రాక్ వంటి సూపర్ హిట్ రవితేజ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటించారు.

సత్య నారాయణ మాట్లాడుతూ.. ఖిలాడి సినిమా కథను రమేష్ వర్మ నాకు చెప్పారు. కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ఇది రవితేజ గారికి బాగుంటుందని అన్నాను. ఆయనకు కూడా కథ వినిపించారు. చేస్తాను అని మాటిచ్చారు. రైటర్ శ్రీకాంత్ గారితో డైలాగ్స్ రాయించాం. అయితే సినిమా ప్రారంభించడానికి ఆలస్యమవుతుందని అనుకున్నాం. కానీ వెంటనే సినిమా చేసేద్దామని రవితేజ అన్నారు. నేను కథను నమ్ముతాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఇలాంటి పాయింట్‌తో ఇది వరకు సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతోంది. బాలీవుడ్ మూవీలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపిస్తుంది. సినిమా ఎంతో స్టైలీష్‌గా ఉంటుంది.  సినిమా మీదు నాకు నమ్మకం ఉంది. సినిమా చూసి ఈ మాట చెబుతున్నాను. రమేష్ వర్మ నాకు ఈ సినిమాను చూపించారు. నాకు బాగా నచ్చింది. దీంతో ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. అందుకే ఆ కారును బహుమతిగా ఇచ్చాను. ఈ కథను ఆల్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది.

ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. అయినా నైజంలో ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సోలో రిలీజ్‌గానే వస్తున్నాం. ఫిబ్రవరి 25వరకు ఇంకో పెద్ద సినిమా ఏదీ కూడా రాకపోవచ్చు. ఖిలాడి సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదని నమ్ముతున్నాను. దేవీ శ్రీ ప్రసాద్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐదు పాటలు హిట్ అయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ మ్యూజిక్ ఇస్తుంటారు. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిందీలో కూడా పోటీగా ఏ సినిమా రావడం లేదు. హిందీలో రవితేజ డబ్బింగ్ చెప్పలేదు. కానీ అక్కడ ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేస్తుంద‌ని న‌మ్మకం ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. U/A సర్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషలలో ఖిలాడి సినిమా విడుదల కానుంది.

Also Read: Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..

Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..

Latest Articles
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో..
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
రుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి కేఎల్ఆర్ ఔట్?
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
ఐపీఎల్‌లో అత్యధిసార్లు 200 పరుగులు చేసిన జట్లు ఇవే..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌