AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..

విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) క‌లిసి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

F3 Movie: పైసా ఉంటే ప్రపంచమే పిల్లి.. లబ్ డబ్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. థియేటర్లలో ఎఫ్ 3 సందడి ఎప్పుడంటే..
F3
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2022 | 7:04 AM

Share

విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) క‌లిసి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2కి ఇది సిక్వెల్‏గా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఎఫ్ 3 పై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్టైనర్ ఎఫ్‌3తో ఈ వేస‌వికి మూడు రెట్ల వినోదాన్ని అందించబోతోన్నారు వెంకీ టీం. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

అయితే ఇప్పుడు ఎఫ్ 3 చిత్రయూనిట్ పాటల జాతర షూరు చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మూవీ నుంచి లబ్ డబ్ లబ్ డబ్ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు ను విడుదల చేశారు. ఈ పాటలో డబ్బుకు ఉన్న శక్తి, గొప్పదనాన్ని వివరించారు. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ.. డబ్బూ.. ఎవడు కనిపెట్టాడో దీన్ని గాని అబ్బో.. కాసులుంటే తప్ప కల్లు ఎత్తి చూడరబ్బో.. చిల్లిగవ్వ లేకుంటే నువ్వు పిండి రుబ్బో.. డబ్బూ.. డబ్బూ.. ప్యాకెట్ లోనా పైసా ఉంటే ప్రపంచమే పిల్లి అవుతుంది.. పులై మనం బతకచ్చు.. విశ్వదాభిరామా.. అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ చక్కటి బాణీని సమకూర్చారు. రామ్ మిర్యాల గాత్రం, భాస్కర భట్ల సాహిత్యం పాటను మరింత అందంగా మలిచాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఎంతో స్టైలీష్‌గా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు భిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో తమన్నా కూడా కనిపిస్తున్నారు. పాట చివర్లో సినిమాలోని నటీనటులంతా కూడా డబ్బు రావాలని చేసే ప్రార్థనలు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..