Kajal Aggarwal: మరోసారి బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన కాజల్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో..
Kajal Aggarwal: సుమారు 15 ఏళ్లపాటు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న కాజల్.. ప్రస్తుతం తల్లిగా ప్రమోషన్ కొట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొదట్లో ఈ విషయాన్ని అటు కాజల్ కానీ, ఇటు భర్త గౌతమ్ కిచ్లు కానీ వెల్లడించలేదు. అయితే...
Kajal Aggarwal: సుమారు 15 ఏళ్లపాటు సినిమాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న కాజల్.. ప్రస్తుతం తల్లిగా ప్రమోషన్ కొట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొదట్లో ఈ విషయాన్ని అటు కాజల్ కానీ, ఇటు భర్త గౌతమ్ కిచ్లు కానీ వెల్లడించలేదు. అయితే వార్తలు మాత్రం ఆగలేదు. దీంతో ఒకానొక సమయంలో గౌతమ్ కిచ్లు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కాన్ఫామ్ చేసేశాడు. 2022లో తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారట్లు గౌతమ్ చేసిన పోస్ట్ అప్పట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కాజల్ అడపాదపడా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బేబీ బంప్‌తో దర్శనిచ్చిందీ అందాల తార. ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే గడుపుతోన్న కాజల్ అగర్వాల్ తాను ఉంటోన్న ఇంటి బాల్కనీలో నిల్చున్న సమయంలో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే గతంలో కాజల్ తన బేబీ బంప్‌ను చూపించకుండా ఫోటోలు పోస్ట్ చేస్తే.. ఇందులో మాత్రం తాను తల్లిని కాబోతున్నట్లు ఫ్యాన్స్‌ను చెప్పకనే చెప్పేసింది. ఇక ఈ ఫోటోలో ఎల్లో కలర్ డ్రస్‌లో చూడముచ్చటగా ఉందీ అందాల తార. ఈ ఫోటోతో పాటు.. ‘సూర్య కిరణాలు నా ముఖాన్ని మృదువుగా తాకుతున్నాయి’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ. కాజల్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆచార్య’లో నటించిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు, హిందీలో కాజల్ నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి బేబీకి జన్మనిచ్చిన తర్వాత కాజల్ నటిగా కెరీర్‌ను కొనసాగిస్తుందా.? లేదా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుందో చూడాలి.
Also Read: Health care: మనం తిన్న తర్వాత నోట్లో వేసుకునే వక్కతో ఎన్ని లాభాలో తెలుసా..
Viral Video: వామ్మో.! ఇదేం తాబేలు.. స్పైడర్‌లా గోడపై జరజరా ఎక్కేస్తోంది.. వీడియో చూస్తే అవాక్కే.!